Perni Nani : అమరావతి – మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చి పోయారు. ఏపీ కూటమి సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాచరిక, అనాగరిక పాలన సాగుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దాడి చేయించింది కాక పైగా తమ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం బాబు హయాంలో తప్పుడు కేసుల పరిపాలన సాగుతోందని వాపోయారు పేర్ని నాని.
Perni Nani Slams MLA Vemireddy Prasanthi Reddy
మంత్రి నారా లోకేష్ పదే పదే తనకు అధికారం ఉందనే గర్వంతో ఎక్కడ పడితే అక్కడ కేసులు నమోదు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తాము బెదిరే ప్రసక్తి లేదన్నారు. దేశమంతటా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు చేస్తుంటే ఒక్క ఏపీలో మాత్రం లోకేష్ తయారు చేసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ధ్వజమెత్తారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని తండ్రీ కొడుకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు తెలుసుకుంటే మంచిదన్నారు.
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై సంచలన కామెంట్స్ చేశారు పేర్ని నాని (Perni Nani). తను మహానటి అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పని చేయడం లేదన్నారు. కేవలం జగన్ రెడ్డిని, ఆయన పరివారాన్ని, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులను ఇబ్బంది పెట్టడం తప్పా చేసింది ఏమున్నదంటూ ప్రశ్నించారు. తప్పుడు కేసులు నమోదు చేస్తే న్యాయస్థానాల్లో తప్పకుండా నిలబెడతామని హెచ్చరించారు పేర్ని నాని.
Also Read : Minister Ponnam Fired on BJP : బీజేపీ విధానం బీసీలకు వ్యతిరేకం – పొన్నం















