హైదరాబాద్ : బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన చిత్రం పెద్ది . ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు రామ్ చరణ్ , జాహ్నవి కపూర్ , జగపతి బాబు, శివ రాజ్ కుమార్ . మ్యూజిక్ డైరెక్టర్ అల్లా రఖా రెహమాన్ సంగీతం అందించారు. తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రానికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించింది, ముఖ్యంగా ప్రధాన పాత్రలో రామ్ చరణ్ తన శక్తివంతమైన నటనతో ప్రశంసలు అందుకున్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించి, ఈ ఏడాది అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సక్సెస్ పురస్కరించుకుని, చిత్ర బృందం జూన్ 23న మంగళవారం ఒక ‘మెగా బ్లాక్‌బస్టర్ వేడుక’ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఈ భారీ వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభం కానుంది. రామ్ చరణ్, దర్శకుడు బుచ్చి బాబు సానా , చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు హాజరవుతారని భావిస్తున్నారు. ‘పెద్ది’ చిత్రంలో జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులతో పాటు మరికొందరు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో ఈ చిత్రం సాధించిన విజయానికి గుర్తుగా జరగనున్న ఈ వేడుక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా పెద్ది సినిమాను పలు భాషలలో రిలీజ్ చేశారు.



















