23 ఏళ్ల తర్వాత ‘బాయ్స్’ నెట్టింట్లో వైర‌ల్

టైటిల్ కార్డులో సీక్రెట్ డీకోడ్ రివీల్

hellotelugu-ShankarBooys

హైద‌రాబాద్ : సోషల్ మీడియాలో ఏ సినిమా ఎప్పుడు, ఎందుకు ట్రెండింగ్‌లోకి వస్తుందో అస్సలు ఊహించలేం. తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన 23 ఏళ్ల నాటి యూత్‌ఫుల్ మ్యూజికల్ మూవీ ‘బాయ్స్’ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అప్పట్లో సామాజిక అంశాలతో సినిమాలు తీసే శంకర్, తొలిసారి తన స్టైల్ మార్చి యూత్ పల్స్ పట్టేలా రూపొందించిన ఈ చిత్రంలోని ఒక ఇంట్రెస్టింగ్ హిడెన్ డీటెయిల్‌ను కొందరు సినీ ప్రేమికులు తాజాగా గుర్తించడంతో ఈ పాత సినిమా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇన్నేళ్లుగా ఎవరి కంటా పడని ఆ క్రేజీ ట్విస్ట్ సినిమా టైటిల్ యానిమేషన్‌లో దాగి ఉండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. సాధారణంగా సినిమా ప్రారంభంలో ‘BOYS’ అనే అక్షరాలు ఏదో తీగ మీద ఎగురుతున్నట్లుగా కనిపిస్తాయి.

అయితే మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను ఎడమ వైపుకు తిప్పి చూస్తే, ఆ తీగ ఒక అమ్మాయి నడుము ఆకృతి అని, ఆ నడుము వంపుల మీదే అక్షరాలు ఎగురుతూ టైటిల్ ఏర్పడుతుందని నెటిజన్లు డీకోడ్ చేశారు. 23 ఏళ్ల క్రితమే శంకర్ ఆలోచించిన ఈ నాటీ క్రియేటివిటీ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 2003లో విడుదలైన ‘బాయ్స్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వాణిజ్య విజయం సాధించక పోయినా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం మాత్రం ఆల్-టైమ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి పోయింది. సిద్ధార్థ్, జెనీలియా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, వివేక్, నకుల్, భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని ఈ కొత్త సీక్రెట్ బయటకు రావడంతో, అప్పటి యూత్‌తో పాటు నేటి జనరేషన్ ఆడియన్స్ కూడా శంకర్ విజన్‌పై ఆసక్తికరంగా చర్చించు కుంటున్నారు

Exit mobile version