BCCI Clear Update : హ్యాండ్ షేక్ వివాదంపై బీసీసీఐ కామెంట్స్

ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు పాకిస్తాన్ బోర్డు ఫిర్యాదు

Hello Telugu - BCCI Clear Update

Hello Telugu - BCCI Clear Update

BCCI : ముంబై : దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ 2025 మెగా టోర్నోలీ చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు పాకిస్తాన్, భార‌త్ మ‌ధ్య జ‌రిగిన కీల‌క పోరులో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ సంద‌ర్బంగా భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ తో పాటు జ‌ట్టు స‌భ్యులు ఎవ‌రూ పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు ఇష్ట ప‌డ‌లేదు. అయితే మ్యాచ్ లో భాగంగా ఐసీసీ రూల్స్ ప్ర‌కారం గెలిచినా లేదా ఓడినా ఇరు జ‌ట్లు తప్ప‌నిస‌రిగా హ్యాండ్ షేక్ చేసుకోవాల్సిందే. కానీ ఇండియా జ‌ట్టు అలా చేయ‌లేదు. ఇందుకు సంబంధించి కెప్ట‌న్ సూర్య కుమార్ యాద‌వ్ మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఎందుకు అలా చేయాల్సి వ‌చ్చింద‌నే దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఇటీవ‌లే జ‌మ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు 26 మంది ప్ర‌యాణీకుల‌ను పొట్ట‌న పెట్టుకున్నారు.

BCCI Comments

దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ భార‌త్ ఆప‌రేష‌న్ సిందూర్ పేరుతో దాడుల‌కు పాల్ప‌డింది. చివ‌ర‌కు కాళ్ల బేరానికి రావ‌డంతో పాకిస్తాన్ తో యుద్దం ఆపి వేసింది. పాకిస్తాన్ పై చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని పహ‌ల్గామ్ మృతుల‌కు, ప్రాణాల‌కు కోల్పోయిన జ‌వాన్ల‌కు అంకితం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్. ఈ నిర్ణ‌యం తాము తీసుకున్న‌ది కాద‌ని భార‌త ప్ర‌భుత్వం, బీసీసీఐ (BCCI) అధికారికంగా చ‌ర్చించిన త‌ర్వాత అందిన ఆదేశాల మేర‌కు అలా చేయాల్సి వ‌చ్చింద‌న్నాడు. కాగా హ్యాండ్ షేక్ వివాదం ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీయ‌డంతో బీసీసీఐ మంగ‌ళవారం స్పందించింది. , క్రికెట్ మ్యాచ్ ముగింపులో ప్రత్యర్థితో కరచాలనం చేయడం కేవలం సద్భావన సంజ్ఞ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్ప‌ష్టం చేశారు. కాగా దీనికి సంబంధించి అంపైర్ పై, బీసీసీఐపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

Also Read : Hydraa Shocking : అక్ర‌మార్కుల క‌బ్జా ఆక్ర‌మ‌ణ‌ల వెల్లువ‌

Exit mobile version