Pawan Kalyan – AP Growth : గ్రామీణ ముఖచిత్రం మారేలా పల్లె పండగ 2.0

స్ప‌ష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

Hello Telugu - Pawan Kalyan - AP Growth

Hello Telugu - Pawan Kalyan - AP Growth

Pawan Kalyan : అమ‌రావ‌తి : పల్లెల్లో పట్టణ స్థాయి అభివృద్ధికి బాటలు వేసేలా ప్రణాళికలు త‌యారు చేయాల‌ని ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. మంగ‌ళ‌వారం పల్లె పండగ 2.0 సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడారు. పల్లె పండగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండగ 2.0 ప్రణాళికలు ఉండాలని స్ప‌ష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు త‌యారు చేయాల‌ని సూచించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ప‌ల్లెల రూపు రేఖ‌లు మార్చేందుకు ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ఉంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో కేంద్రం కూడా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తోంద‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

Deputy CM Pawan Kalyan Key Comments

త్వరలో ప్రారంభం కానున్న పల్లె పండుగ 2.0పై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్న‌తాధికారులు ఫోక‌స్ సారించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఎలాంటి నిర్ల‌క్ష్యం వ‌హించ వ‌ద్ద‌ని కోరారు. గ్రామ పంచాయ‌తీల‌ను రూర్బ‌న్ పంచాయ‌తీలుగా మారుస్తామ‌ని చెప్పారు డిప్యూటీ సీఎం. ఇదే స‌మ‌యంలో కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుడ‌తామ‌న్నారు. రహదారుల అభివృద్ధి, నూతన రహదారుల నిర్మాణం, మరమ్మతులు, గోశాలలు, మ్యాజిక్ డ్రైయిన్ల నిర్మాణం తదితర అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఒ.ఎస్.డి. వెంకటకృష్ణ, ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ బాలు నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : Ponnam Prabhakar Shocking Comments : మాగంటి సునీత క‌న్నీళ్లు పెట్ట‌డం ఓ నాట‌కం

Exit mobile version