Ponnam Prabhakar Shocking Comments : మాగంటి సునీత క‌న్నీళ్లు పెట్ట‌డం ఓ నాట‌కం

నిప్పులు చెరిగిన మంత్రులు తుమ్మ‌ల‌, పొన్నం

Hello Telugu - Ponnam Prabhakar Shocking Comments

Hello Telugu - Ponnam Prabhakar Shocking Comments

Ponnam Prabhakar : హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన మాగంటి సునీత క‌న్నీళ్లు పెట్టుకోవ‌డంపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar), తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు. కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో త‌ను భావోద్వేగానికి లోన‌య్యారు. త‌న భ‌ర్త మాగంటి గోపీనాథ్ ను త‌లుచుకుని కంట‌త‌డి పెట్టారు. కాగా ఆ కన్నీళ్లకు దురుద్దేశాలను ఆపాదిస్తూ అప‌హాస్యం చేశారు. సానుభూతితో ఓట్లు సంపాదించాలనే ప్రయత్నంలో మాగంటి సునీత కృత్రిమ ఏడుపులు ఏడుస్తోందంటూ వారు ఎగ‌తాళి చేశారు.

Minister Ponnam Prabhakar Shocking Comments

తుమ్మల నాగేశ్వర్ రావు ఏమో ఆడ కూతురు కన్నీళ్లను కూడా వదిలిపెట్టట్లేరు . వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొందాలని చూస్తున్నారు అని అవమానపరిచాడు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సునీతనుద్దేశిస్తూ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సునీత, ఆమె కూతురు అక్షరలపై అక్రమ కేసు బనాయించిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు ఇలా ఆమెను ఎగతాళి చేస్తూ పైశాచికానందం పొందుతున్నారని జూబ్లీహిల్స్ ప్రజలు మండిపడుతున్నారు.

ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు సహనం కోల్పోయి ఇలా వాగుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Minister Ram Prasad Huge Arrangements : ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌కు 3500 బ‌స్సులు

Exit mobile version