Pawan Kalyan Interesting Update : రైతులకే తిరిగి రిజిస్ట్రేషన్ మాట నిల‌బెట్టుకున్న ప‌వ‌న్

రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు

Hello Telugu - Pawan Kalyan Interesting Update

Hello Telugu - Pawan Kalyan Interesting Update

Pawan Kalyan : అమ‌రావ‌తి : కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పరిధిలోని భూములను తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిలబెట్టుకున్నారు. సెజ్ పరిధిలోని 2,180 ఎకరాల భూములకు స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసేలా చొరవ తీసుకొన్నారు. గ‌త కొన్ని ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించారు. దీంతో కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల పరిధిలో సుమారు 1,551 మంది రైతులకు మేలు జరగనుంది. కాకినాడ సెజ్ రైతుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీసుకు వెళ్లారు.

Deputy CM Pawan Kalyan Key Comments

ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కాకినాడ సెజ్ రైతులకు ఊరట కలిగించేలా ఇచ్చిన భూముల్లో 2,180 ఎకరాలను తిరిగి రైతులకు ఇచ్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు కాకినాడ సెజ్ లో అవార్డు భూములను తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలిచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ లకు రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయకూడదని ఆదేశాలలో పేర్కొన్నారు. ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. కాగా రైతులకు వెనక్కి ఇచ్చిన భూమి, తిరిగి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కాక సతమతం అవుతున్న విషయంపై దృష్టి సారించారు డిప్యూటీ సీఎం. గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సరిచేస్తూ రైతులకు న్యాయం చేశారు.

Also Read : Amit Shah Strong Warning : గీత దాటితే మరోసారి దాడులు త‌ప్ప‌వు : అమిత్ షా

Exit mobile version