Pawan Kalyan : ఏలూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల (Pawan Kalyan) ఏలూరు జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు. పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఐ.ఎస్. జగన్నాథపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్ ను పరిశీలించారు. డ్రెయిన్ నిర్మాణంలో ఎన్ని పొరలు ఎన్ని ఉంటాయి? ఎంత లోతులో నిర్మించారు? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రెయిన్ ను ఆనుకుని ఉన్న ఇంటి నుంచి ఒక బిందె నీటిని వంపి పని తీరుని పరిశీలించారు. రూ. 77,173 నిర్మాణ వ్యయంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కేవలం మూడు రోజుల్లో ఈ డ్రెయిన్ నిర్మాణం పూర్తి చేసినట్టు అధికారులు తెలియ జేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పల్లెల్లో మురుగు నీటి నిర్వహణ మెరుగుపర్చేందుకు ఈ మ్యాజిక్ డ్రెయిన్ వ్యవస్థను తీసుకువచ్చారు.
DY CM Pawan Kalyan Comments
మలి విడత పైలెట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఐ.ఎస్.జగన్నాథపురంలో నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్ ను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పని తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మిగతా గ్రామాల్లో కూడా దశలవారీగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మురుగునీటి సమస్యలకు తక్కువ ఖర్చుతో మెరుగైన పరిష్కారం ఉంటుందన్నారు. దుర్వాసనలు, దోమల పెరుగుదల, కాలుష్యం, రోడ్లపై నీరు నిల్వ ఇవన్నీ తగ్గించే వ్యవస్థ దీని ద్వారా మెరుగు పడుతుందన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల. సిమెంట్ డ్రెయిన్ 1 కి.మీ. ఖర్చు: రూ.50 లక్షలు; మ్యాజిక్ డ్రెయిన్ 1 కి.మీ. ఖర్చు రూ.7.5 లక్షలు మాత్రమే అవుతుందన్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన దీనిని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్.
Also Read : Suresh Raina Shocking Comments : రిషబ్ పంత్ కంటే సంజూ శాంసన్ బెటర్
