Pawan Kalyan : అమరావతి : మొంథా తుపాను ప్రభావం పిఠాపురం నియోజకవర్గంపై తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమీక్ష చేపట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులు సమన్వయం చేసుకోవాలని ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. ఉప్పాడ, మూలపేట, కోనపాపపేట తదితర తీర ప్రాంత గ్రామాల్లో సహాయక చర్యల పర్యవేక్షణకు గ్రామానికి ఒకరు చొప్పున ప్రత్యేక అధికారులను నియమించారు. 34మంది సభ్యులతో ఒక ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందం పిఠాపురం నియోజకవర్గంలో అప్రమత్తంగా ఉంది. 34 బోట్లు సిద్ధం చేశారు. వీరికి తోడుగా 12 మంది సభ్యుల క్విక్ రెస్పాన్స్ టీమ్ సభ్యులు, 12 మంది గజ ఈతగాళ్ళు ఉన్నారు. పిఠాపురం కేంద్రంగా ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందం పని చేస్తోంది.
DY CM Pawan Kalyan Comments
కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ కాకినాడ జిల్లాలో ఉన్న తుపాను ప్రభావ పరిస్థితులను ఉప ముఖ్యమంత్రి సమీక్షిస్తూ ఉన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంట గంటకు నివేదికలు తీసుకుంటున్నారు. జిల్లాతో పాటు పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 25 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆహారం, తాగునీరు, పాలు, అత్యవసర ఔషధాలను సమకూర్చి, వైద్య ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎక్కడైనా విద్యుత్ స్తంబాలు నేల కూలితే తక్షణమే స్పందించేలా వ్యవస్థను సన్నద్ధం చేయడంతో పాటు 500 స్తంబాలను స్టాండ్ బైగా ఉంచారు.
Also Read : Montha Cyclone Sensational : తీరం దాటిన ముంథా తుపాను ఏపీ పరేషాన్
