Montha Cyclone : అమరావతి : బంగాళాఖాతంలో అల్ప పీడనం చోటు చేసుకుంది. ముంథా తుపాను (Montha Cyclone) ముంచుకు వస్తోంది. పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు తెగి పోయాయి. కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఏపీ అంతటా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ రాక పోకలు నిలిచి పోయాయి. ముందు జాగ్రత్తగా పలు రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. ఇదిలా ఉండగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో రవాణా సంస్థ పూర్తిగా స్తంభించి పోయింది. ఇప్పటికే ఏపీ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ముంథా తుపాను ముంచుకు వస్తుందని ప్రకటించారు ఎండీ ప్రఖర్ జైన్.
Montha Cyclone Updates
ఇదిలా ఉండగా అత్యధికంగా కావలిలో 23.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. సింగరాయకొండలో 18.7, దగదర్తిలో 18.2, ఉలవపాడులో 17, కందుకూరులో 16.8, కొడవలూరులో 15.2, కలిగిరిలో 14.4, నెల్లూరులో 11 సెం.మీ వర్షపాతం నమోదైందని వెల్లడించారు ఎండీ. మరో వైపు తుపాను ధాటికి అల్లకల్లోలంగా మారింది కాకినాడ తీరం. తాళ్లరేవు నుంచి తొండంగి మండలం వరకు తీరం వెంబడి ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి అలలు. యు.కొత్తపల్లి మండలం కొమరిగిరి నుంచి కొనపాపపేట వరకు రాకాసి అలలు దాడి చేయడంతో చాలావరకు ధ్వంసమైంది రహదారి. తీరం వెంబడి రాళ్ల గట్టు ఉన్నప్పటికీ 8 నుంచి 10 అడుగుల ఎత్తున అలలు ఎగసి పడటంతో సముద్రం నీరు చేరి ముంపునకు గురయ్యాయి పొలాలు.
Also Read : CM Chandrababu Important Update : సహాయక చర్యలు ముమ్మరం చేశాం
