MP Kesineni Chinni Growth : ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎంపీ చిన్ని

కార్య‌ద‌ర్శిగా మ‌రో ఎంపీ సానా స‌తీష్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌

Hello Telugu - MP Kesineni Chinni Growth

Hello Telugu - MP Kesineni Chinni Growth

MP Kesineni Chinni : అమ‌రావ‌తి – విజయవాడలో ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం జ‌రిగింది. ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఏసీఏ నూతన కమిటీ ఎన్నికైంది. అధ్యక్షుడిగా టీడీపీ ఎంపీ కేసినేని చిన్నిని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్ ఎన్నిక‌య్యారు. మ‌రో 34 మందితో ఏసీఏ నూత‌న క‌మిటీ ఎన్నికైంది. మూడేళ్ల కాల ప‌ర‌మితితో ఈ క‌మిటీ ప‌ని చేస్తుంది. భవిష్యత్తులో చేపట్టనున్న పనులు, స్టేడియాల నిర్మాణం, టోర్నమెంట్ల నిర్వహణపై సమీక్ష జ‌రిగింది.

MP Kesineni Chinni as AP Cricket Association Chairman

ఇదిలా ఉండ‌గా ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నిక కావడం వ‌రుస‌గా ఇది రెండోసారి కావ‌డం విశేషం. నూత‌న ప్రెసిడెంట్ గా ఎన్నికైన కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు. త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి మ‌రోసారి అధ్య‌క్షుడిగా ఎన్నుకున్నందుకు సభ్యుల‌కు, కార్య‌వర్గానికి ధన్య‌వాదాలు తెలిపారు. భ‌విష్య‌త్తులో ఏపీని క్రికెట్ రంగానికి కేరాఫ్ గా మారుస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు చిన్ని (MP Kesineni Chinni). ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫీవ‌ర్ న‌డుస్తోంద‌ని చెప్పారు. ప్ర‌తి జిల్లా కేంద్రంలో క్రికెట్ ఆట‌కు ఆద‌ర‌ణ క‌ల్పించేందుకు మౌలిక వ‌స‌తుల క‌ల్పనపై ఫోక‌స్ పెడ‌తామ‌న్నారు.

రాబోయే రోజుల్లో భార‌త క్రికెట్ జ‌ట్టులో ఏపీ నుంచి క్రికెట‌ర్లు ప్రాతినిధ్యం వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటా మ‌న్నారు. ఇప్ప‌టికే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్ స‌పోర్ట్ తో ముందుకు వెళ‌తామ‌ని పేర్కొన్నారు నూత‌న అధ్య‌క్షుడు. పెద్ద ఎత్తున నిధుల‌ను కేటాయించేందుకు సుముఖంగా ఉన్నామ‌న్నారు. త్వ‌ర‌లోనే ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు క‌డా ప్లాన్ చేస్తున్నామ‌న్నారు కేశినేని చిన్ని.

Also Read : Illegal Surrogacy : అక్ర‌మ స‌రగోసి దందా ముఠా అరెస్ట్

Exit mobile version