Pat Cummins Shocking : ఆసిస్ ఇండియా సీరీస్ కు పాట్ క‌మిన్స్ దూరం

వెన్ను నొప్పి కార‌ణంగా త‌ప్పుకున్న క్రికెట‌ర్

Hello Telugu - Pat Cummins Shocking

Hello Telugu - Pat Cummins Shocking

Pat Cummins : ప్ర‌ముఖ స్టార్ క్రికెట‌ర్ పాట్ క‌మిన్స్ (Pat Cummins) ఆసిస్, ఇండియా సీరీస్ కు దూరం కానున్నాడా. అవున‌నే స‌మాధానం వ‌స్తోంది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నుండి. వ‌చ్చే అక్టోబ‌ర్ 1 నుండి మూడు టి20 మ్యాచ్ లు న్యూజిలాండ్ తో త‌ల‌ప‌డ‌నుంది. ఆ త‌ర్వ‌త టీమిండియాతో ఆస్ట్రేలియా జ‌ట్టు ఆడ‌నుంది. టూర్ లో భాగంగా టీమిండియా అక్టోబ‌ర్ 19 నుంచి 25 వ‌ర‌కు మూడు వ‌న్డే మ్యాచ్ ల‌తో పాటు అక్టోబ‌ర్ 29 నుంచి న‌వంబ‌ర్ 8 వ‌ర‌కు ఐదు టి20 మ్యాచ్ లు ఆడ‌నుంది. ఆ త‌ర్వాత నవంబర్ 21న పెర్త్‌లో ఇంగ్లాండ్‌తో స్వదేశీ యాషెస్ టూర్ ప్రారంభమవుతుంది.

Pat Cummins Quit From Australia-India Test Series

ఆస్ట్రేలియా ప్రీమియర్ పేసర్, టెస్ట్ జ‌ట్టు కెప్టెన్ గా కొన‌సాగుతున్న పాట్ కమ్మిన్స్ మంగళవారం భారతదేశం, న్యూజిలాండ్‌తో జరగబోయే వైట్-బాల్ సిరీస్‌కు లోయర్-బ్యాక్ సమస్య కారణంగా దూరంగా ఉన్నాడు, ఈ విష‌యాన్ని ఆస్ట్రేలియా బోర్డు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు అధికారికంగా రిలీజ్ చేసింది. ఇదిలా ఉండ‌గా 32 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన పాట్ క‌మిన్స్ ఈ శీతాకాలంలో యుకె, విండీస్ ల‌తో జ‌రిగిన నాలుగు టెస్టుల‌లో 95 ఓవ‌ర్ల‌కు పైగా బౌలింగ్ చేశాడు. వెన్ను నొప్పి బాధ పెట్ట‌డంతో త‌ట్టుకోలేక సీరీస్ ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. దీంతో టాప్ ప్లేయ‌ర్ దూరం కావ‌డం ఆసిస్ జ‌ట్టుకు బిగ్ షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : Bigg Boss Interesting Update : సెప్టెంబ‌ర్ 7న బిగ్ బాస్ షో రెడీ

Exit mobile version