న్యూఢిల్లీ : బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగాన్ని సవరించాలని కోరారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. న్యూఢిల్లీలో తాడో పేడో తేల్చుకునేందుకు వెళ్లారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమతో ఆడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా కోటా మా వాటా అనే నినాదంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. బుధవారం బీసీల ఆకాంక్షలను గౌరవించి బీసీ రిజర్వేషన్లు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీలో ఇవాళ కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ తో బీసీ సంఘాల నేతలు భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా సుదీర్ఘంగా చర్చించారు కేంద్ర మంత్రితో. తెలంగాణ రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీసీల ఆకాంక్షలను గౌరవించి, బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని ప్రస్తుతం జరిగే పార్లమెంటు సమావేశాలలోనే ఆమోదించాలని బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రి వీరేంద్ర కుమార్ కు విజ్ఞప్తి చేశారు . ఈ మేరకు బిఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో పార్లమెంటులోని కేంద్ర మంత్రి కార్యాలయంలో బీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు.
















