కృష్ణ జిల్లా : టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని పేర్కొన్నారు. బుధవారం అవనిగడ్డలో జరిగిన కీలక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా 4వే ల పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో కేవలం వెయ్యి మాత్రమే ఇస్తున్నారు. జులై మూడోవారంలో తల్లికి వందనం రెండోవిడత నగదు జమ చేయబోతున్నాం. స్త్రీశక్తి కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం, దీపం పథకం కింద ప్రతిఏటా 3 సిలిండర్లు అందజేస్తున్నాం. అన్నదాత సుఖీభవ, అన్నక్యాంటీన్, మత్స్యకారుల సేవలో, ఆటోడ్రైవర్ల సేవలో, చేనేతలకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందించాం అన్నారు నారా లోకేష్. మెగా డిఎస్సీ ద్వారా పారదర్శకంగా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. గొడ్డలి పార్టీ అయిదేళ్ల పాలనలో కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు. ఆ గోతులు పూడ్చేందుకే 2వేల కోట్లు ఖర్చయింది. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్తున్నాం. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు పెట్టుబడులు, పరిశ్రమలు తెస్తున్నాం అని అన్నారు నారా లోకేష్.
కార్యకర్తే అధినేత అనే నినాదానికి కట్టుబడి దేశంలో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం అమలు చేస్తున్నాం. చని పోయిన కార్యకర్తలకు 5 లక్షల సాయం అందిస్తున్నాం. తప్పుడు కేసులన్నీ తీసివేసే బాధ్యత నేను తీసుకున్నాను. కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్లు ఖర్చుపెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం. కార్యకర్తలు సొంతకాళ్లపై నిలబడాలన్నదే మా ధ్యేయం. మిమ్మల్ని నిలబట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీది. క్లస్టర్ ఇన్ చార్జి, యూనిట్ ఇన్ చార్జిల శిక్షణా తరగతుల సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహస్తే, 75 శాతం మందికి సుగర్, హైపర్ టెన్షన్ ఉన్నాయి. క్లస్టర్, యూనిట్, బూత్ నాయకులందరికీ పరీక్షలు చేయమని సిఎం చెప్పారు, ఆ కార్యక్రమం కూడా చేపడతాం. మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చే బాధ్యత తీసుకుంటాం. యోగాంధ్రలో చంద్రబాబు ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన స్పీడ్ అందు కోవడం కష్టం. ఆయన ప్రతిరోజూ యోగా చేస్తారు.
తెలుగుదేశం పార్టీ కుటుంబం లాంటిది, చిన్నచిన్న సమస్యలు ఉంటాయి, కూర్చుని మాట్లాడుకుందాం. పార్టీలో సంస్కరణల కోసం నేను ఎంతో పోరాడాను. సమస్య ఎదురైతే పరిష్కారమయ్యేవరకు వందసార్లు పోరాడదాం. కష్టపడిన కార్యకర్తలను గుర్తించేందుకు ఇప్పుడు మై టిడిపి యాప్ తెచ్చాం. మీరు చేస్తున్న కష్టం ఈ యాప్ ద్వారా తెలియ జేయండి, యాక్టివ్ గా ఉండండి. గ్రామస్థాయి నాయకుడ్ని పొలిట్ బ్యూరోలో కూర్చో బెట్టేవరకూ పోరాడాను. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి క్లస్టర్ ఇన్ చార్జి, మండల పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యారు. గ్రామస్థాయి నుంచి మార్పురావాలన్నది నా లక్ష్యం. పార్టీ మనది, దీనిని కాపాడు కోవడం మన బాధ్యత. కలసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలి.


















