Ex IAS Vijay Kumar : అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్. ఆయనపై విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ మేరకు అమరావతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం తను పిటిషన్ దాఖలు చేశారు. ఎంఎం రత్నం నిర్మాణ సారథ్యంలో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ , బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించిన హరి హర వీరమల్లు సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అయితే తను అధికారంలో ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడంటూ ఆరోపించారు. హరి హర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిధులు వాడుకున్నారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.
Ex IAS Vijay Kumar Demands
ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ (Ex IAS Vijay Kumar). ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న తను ప్రజలకు , రాష్ట్రానికి జవాబుదారీగా ఉండాలని కోరారు. కాగా దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది హైకోర్టు. స్పందించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే విజయ్ కుమార్ కొత్త పార్టీని స్తాపించారు. తనను కూటమి సర్కార్ టార్గెట్ చేసినా ఎక్కడా తగ్గడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్నారు.
Also Read : Minister Satya Prasad Warning : కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్త
