Palla Srinivasa Rao Strong Focus : ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ఫోక‌స్ : ప‌ల్లా

విన‌తులు స్వీక‌రించ‌డం మా బాధ్య‌త

Hello Telugu - Palla Srinivasa Rao Strong Focus

Hello Telugu - Palla Srinivasa Rao Strong Focus

Palla Srinivasa Rao : అమ‌రావ‌తి : ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందు కోస‌మే తాము ప్ర‌జా ద‌ర్బార్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టామ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస రావు (Palla Srinivasa Rao). ప‌ద‌వి ఉంద‌ని విర్ర‌వీగితే ఎలా అని ప్ర‌శ్నించారు. ప‌ద‌వి ఉన్నా లేకున్నా ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే నేత‌లు ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ఎప్పుడూ ఒకేలాగా ఉండేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు. మ‌న‌ల్ని న‌మ్ముకుని ఎంతో దూరం నుంచి ప్ర‌జ‌లు త‌మ బాధ‌లు, స‌మ‌స్య‌లు చెప్పుకునేందుకు వ‌స్తార‌ని వారికి భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేయాల‌ని ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు సూచించారు. ఆయ‌న ఎప్ప‌టి లాగే ప్ర‌జా ద‌ర్బార్ కు హాజ‌ర‌య్యారు.

Palla Srinivasa Rao Key Comments

రాత్రి 10 గంట‌లు అవుతున్నా ఎక్క‌డికీ వెళ్ల‌లేదు. క్యాంపు కార్యాల‌యంలోనే ఉన్నారు. ప్ర‌జ‌లు ఇచ్చిన విన‌తి ప‌త్రాల‌ను స్వీక‌రించారు. ఆయా శాఖ‌ల అధికారుల‌కు పంపించి త్వ‌ర‌లోనే ప‌రిష్కారం అయ్యేలా చేస్తాన‌ని వారికి తెలిపారు. ప్రజల సమస్యలు విన్నప్పుడు అలసట కన్నా బాధ్యత ఎక్కువగా అనిపిస్తుందన్నారు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు. ప్రతి వినతి వెనుక ఒక కుటుంబం బాధ, కష్టం తీరుతుందనే ఆశ ఉంటుందన్నారు. ప్రజలతో ఉండటం అనేది కేవలం రాజకీయ విధి కాదని, అది ఒక హృదయ సంబంధం, ఒక సేవా నిబద్ధత అని స్ప‌ష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం, వారి ఆశలకు స్పందించడం మా బాధ్యత అని అన్నారు.

Also Read : Minister Gottipati Ravi Interesting Update : విద్యుత్ ప‌రంగా స‌మ‌ర్థ‌వంత‌మైన సేవ‌లు

Exit mobile version