Minister Gottipati Ravi Interesting Update : విద్యుత్ ప‌రంగా స‌మ‌ర్థ‌వంత‌మైన సేవ‌లు

మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం

Hello Telugu - Minister Gottipati Ravi Interesting Update

Hello Telugu - Minister Gottipati Ravi Interesting Update

Minister Gottipati Ravi : అమ‌రావ‌తి : కూట‌మి ప్ర‌భుత్వం విద్యుత్ రంగానికి ప్ర‌యారిటీ ఇస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ (Minister Gottipati Ravi). అనకాపల్లిలో రూ.5.50 కోట్ల వ్యయంతో కొత్త ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) సర్కిల్ కార్యాలయ భవనానికి శంఖుస్థాపన చేశారు. విద్యుత్ వినియోగదారులకు మరింత సమర్థవంతమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు ఆధునిక సదుపాయాలతో ఈ భవనం నిర్మించేందుకు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు గొట్టిపాటి ర‌వికుమార్. గ‌త ప్ర‌భుత్వం విద్యుత్ రంగాన్ని ప‌ట్టించు కోలేద‌న్నారు. విద్యుత్ వినియోగదారుల‌కు జ‌గ‌న్ రెడ్డి కోలుకోలేని షాక్ ఇచ్చార‌ని ఆరోపించారు.

Minister Gottipati Ravi Kumar Comments

కానీ త‌మ కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక విద్యుత్ ప‌రంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామ‌ని చెప్పారు. దేవుడి ద‌య వ‌ల్ల స‌మృద్దిగా నీళ్లు ఉన్నాయ‌ని, ఆయా జ‌లాశ‌యాల‌లో నిరంత‌రాయంగా విద్యుత్ ఉత్ప‌త్తి ప్ర‌క్రియ నిరంత‌రాయంగా కొన‌సాగుతోంద‌ని చెప్పారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ .అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యుత్ శాఖ ప‌రంగా మెరుగైన సేవ‌లు అందించేందుకు గాను చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. పెద్ద ఎత్తున నూత‌న భ‌వ‌నాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామ‌న్నారు. అవ‌స‌రం అనుకున్న మేర‌కు స‌బ్ స్టేషన్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ , అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి , ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి APEPDCL సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి , డైరెక్టర్ (ఆపరేషన్స్) టి.వి. సూర్యప్రకాష్ , పర్యవేక్షక ఇంజనీర్ జి. ప్రసాద్ , ఇతర ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Also Read : MLA Adinarayana Reddy Shocking Comments : వైఎస్ జ‌గ‌న్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం

Exit mobile version