Pakistan Sensational : ఆసియా క‌ప్ నుంచి పాకిస్తాన్ త‌ప్పుకుంటుందా..?

ఇండియాతో హ్యాండ్ షేక్ వివాదం రాద్దాంతం

Hello Telugu - Pakistan Sensational

Hello Telugu - Pakistan Sensational

Pakistan : దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ 2025 (Asia Cup 2025) వివాదాల‌కు కేరాఫ్ గా మారింది. భార‌త్ చేతిలో ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది పాకిస్తాన్ (Pakistan) జ‌ట్టు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఓట‌మి చ‌విచూసింది. మ్యాచ్ ముగిసిన అనంత‌రం భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌తో క‌ర‌చాన‌లం చేసేందుకు ఒప్పుకోలేదు. నేరుగా పెవిలియ‌న్ కు వెళ్లి పోయారు. భార‌త దేశంలోని జ‌మ్మూ కాశ్మీర్ లోని ప‌హ‌ల్గామ్ లో 26 మంది ప్ర‌యాణీకుల‌ను పాక్ ఆక్ర‌మిత ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. దీనిపై ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. దీనిని నిర‌సిస్తూ మోదీ స‌ర్కార్ ఆప‌రేష‌న్ సిందూర్ తో పాకిస్తాన్ పై దాడికి దిగింది. చివ‌ర‌కు కాళ్ల బేరానికి రావ‌డంతో యుద్దాన్ని ఆపేసింది.

Pakistan Sensational Decision

దీంతో మ్యాచ్ గెలుపొందిన త‌ర్వాత టీమిండియా స్కిప్ప‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.
ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా , బాధితుల‌కు సంఘీభావంగా తాము ఈ మ్యాచ్ ను అంకితం ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది దాయాది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ అంశాన్ని ప్ర‌ధానంగా ఎత్తి చూపింది. ఈ మేర‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఎల్) కు ఫిర్యాదు చేసింది. మ్యాచ్ అంపైర్ ను తొల‌గించాల‌ని, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. ఈ సంఘటనను పక్షపాతంతో తప్పుగా నిర్వహించారని ఆరోపించింది, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. కాగా ఐసీసీ ఈ అభ్యర్థనను పూర్తిగా తిరస్కరించింది, టోర్నమెంట్‌లో నిర్ణయాత్మక క్షణానికి వేదికగా నిలిచింది . దీంతో టోర్నీలో ఆడాలా లేక నిష్క్ర‌మించాలా అన్న దానిపై పీసీబీ ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం.

Also Read : ED Shocking Chhattisgarh CM Son : లిక్క‌ర్ స్కాంలో మాజీ సీఎం కొడుకు కీల‌కం

Exit mobile version