ED : ఢిల్లీ : ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ బాఘేల్ కు బిగ్ షాక్ తగిలింది. రూ. 2,500 కోట్ల లిక్కర్ స్కాం కేసులో తన కుమారుడు కీలకమైన వ్యక్తిగా ఉన్నాడని మంగళవారం అధికారికంగా ప్రకటించింది. తన తండ్రి ముఖ్యమంత్రిగా కొలువు తీరిన కాలంలో కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. ప్రధానంగా చైతన్య బాఘేల్ సిండికేట్ సంస్థలను నియంత్రించాడని ఆరోపించింది. రూ. 1,000 కోట్లను వసూలు చేశాడని, వాటిని అక్రమంగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పెట్టుబడిగా పెట్టాడని వెల్లడించింది. మాజీ సీఎం తనయుడు మద్యం కుంభకోణం సిండికేట్ కు నాయకత్వం వహించాడని స్పష్టం చేసింది. ఈ విషయం తాము జరిపిన విచారణలో తేలిందని స్పష్టం చేసింది. దీని వెనుక అధికార దుర్వినియోగం ఉందని , దాని కారణంగానే భారీ ఎత్తున స్కాం చోటు చేసుకుందని తెలిపింది ఈడీ.
ED Shocking Chhattisgarh CM Son
నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాచడం, స్వాధీనం చేసుకోవడం, ఉపయోగించడంలో చైతన్య తెలిసి కూడా సహాయం చేశాడని, సిండికేట్‌లోని ఇతర సభ్యులతో కుట్ర పన్నాడని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దుర్గ్ జిల్లాలోని భిలాయ్ పట్టణంలో స్వంత నివాసంలో జరిగిపిన సోదాలలో ఆధారాలు బయట పడ్డాయని పేర్కొంది. ఇదిలా ఉండగా సోదాలు జరిపిన అనంతరం గత జూలై 18న కేంద్ర ఏజెన్సీ చైతన్య బాఘేల్‌ను అరెస్టు చేసింది. 2019 – 2022 మధ్య రాష్ట్రంలో భూపేశ్ బాఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.2,500 కోట్ల మద్యం కుంభకోణం జరిగింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు ఒక ప్రాసిక్యూషన్ ఫిర్యాదు తో పాటు నాలుగు సప్లిమెంటరీ ఫిర్యాదులను దాఖలు చేసింది. ఈ స్కాం కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడిందని ఆరోపించింది.
Also Read : AP Govt Shocking Decision : ఏపీలో 86 లక్షల టన్నుల వ్యర్థాలు
