P Shiva Shankar : పుంజాల శివ శంకర్ జయంతి ఇవాళ. ఆయన ఆగస్టు 10, 1929లో హైదరాబాద్ లోని మామిడిపల్లిలో పుట్టారు. ఫిబ్రవరి 17, 2017లో తనువు చాలించారు. అమృతసరిలో హిందూ కాంలేజ్ నుంచి బీడీఏ ఇది బీఏతో సమానమైన కోర్సు చదివారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి ఎల్ ఎల్ బి పూర్తి చేశారు. రాజకీయ పరంగా అపారమైన అనుభవం కలిగి ఉన్నారు. ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 1974–75లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పని చేశారు. ఆ తర్వాత రాజీనామా చేశారు. 1979లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1980లో తిరిగి గెలుపొందారు. ఇందిరా గాంధీ ప్రభుత్వం లో న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. దేశ న్యాయ వ్యవస్థలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు.
P Shiva Shankar Birth Anniversary
అనంతరం దివంగత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కేబినెట్ లో విదేశాంగ వాఖ , పెట్రోలియం, విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశారు. అంతే కాకుండా జాతీయ ప్రణాళిక వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. 1985–93 మధ్య గుజరాత్ ప్రతినిధిగా, రాజ్యసభ సభ్యుడిగా, 1988 నుంచి 89 వరకు హౌస్ నాయకుడిగా, 1989 నుంచి 1991 వరకు విపక్ష నాయకుడిగా సేవలు అందించారు పుంజాల శివ శంకర్ (P Shiva Shankar). 1994–95లో సిక్కిం గవర్నర్ గా , 1995–96లో కేరళ గవర్నర్ గా విశిష్ట సేవలు అందించారు. 1998లో తిరిగి లోక్‌సభకు ఎంపికయ్యారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి వేటుకు గురయ్యారు. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో చేరారు. 2011లో అది తిరిగి కాంగ్రెస్ లో విలీనం అయింది.
Also Read : Manickam Tagore Fired on Modi : ఈసీపై చర్చకు రావాలని మోడీకి సవాల్
















