కేరళ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గ్రహీత, కేరళ సూపర్ స్టార్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ భారతీయ మీడియా సంస్థ ఇండియా టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్ క్లేవ్ లో మరో ఓపెనర్ , యంగ్ స్టార్ అభిషేక్ శర్మతో కలిసి పాల్గొన్నాడు సంజు శాంసన్. ఈ సందర్బంగా తామిద్దరి భాగస్వామ్యంపై స్పందించాడు. మా ఇద్దరి మధ్య ఉన్నది మంచు నిప్పు కలయిక కాదన్నాడు. తమది నిప్పు తో కూడిన నిప్పు కలయిక అని చెప్పాడు. తాజాగా సంజు శాంసన్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తామిద్దరి మధ్య అనుబంధం ఇప్పటిది కాదని, గత 2024వ సంవత్సరం కొనసాగుతూ వస్తున్నదని తెలిపాడు. కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్య, మేనేజ్మెంట్ తో జరిగిన కీలక సమావేశంలో వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారని అన్నాడు.
ఆ మేరకు ప్రతి ఒక్క ఆటగాడు ఆడటం మొదలు పెట్టడం జరిగిందన్నాడు సంజు శాంసన్. ఇదే క్రమంలో న్యూజిలాండ్‌తో జరిగిన 2026 T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో మా భాగస్వామ్యం, సమన్వయమే కీలక పాత్ర పోషించిందని అభిప్రాయపడ్డాడు కేరళ స్టార్ క్రికెటర్. ఇదిలా ఉండగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ కలిసి ఓపెనింగ్ పెయిర్ లో 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పటి వరకు టి20 వరల్డ్ కప్ ఫార్మాట్ లో ఇదే హయ్యెస్ట్ పెయిర్ కావడం విశేషం. ఈ టోర్నీలో శాంసన్ 5 ఇన్నింగ్స్ లు ఆడాడు. 321 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుకు కూడా ఎంపికయ్యాడు.

















