Oscars 2026 – Beauty Janhvi’s Movie : ఆస్కార్ 2026 బ‌రిలో హోమ్ బౌండ్

ముఖ్య పాత్ర పోషించిన జాన్వీ క‌పూర్

Hello Telugu - Oscars 2026 - Beauty Janhvi's Movie

Hello Telugu - Oscars 2026 - Beauty Janhvi's Movie

Oscars 2026 : ముంబై : భార‌త దేశం త‌ర‌పున ప్ర‌ముఖ న‌టి జాన్వీ క‌పూర్ కీ రోల్ పోషించిన హోమ్ బౌండ్ సినిమా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆస్కార్ 2026 బ‌రిలో నిలిచింది. సినిమాను ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది కేంద్ర స‌మాచార మంత్రిత్వ శాఖ‌. నీరజ్ ఘయ్వాన్ చిత్రం ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ రేసులో ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించనుంది. ఇషాన్, విశాల్ , జాన్వి భారతదేశ అధికారిక ఆస్కార్ 2026 (Oscars 2026) ఎంట్రీహోమ్‌బౌండ్ చిత్రంలో నటించారు. దీనిని ఘ‌య్యాన్ నిర్మించారు. ఈ విష‌యన్ని వెల్ల‌డించారు ఎంపిక క‌మిటీ చైర్ ప‌ర్స‌న్ ఎన్. చంద్ర‌. హోమ్ బౌండ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అన్ సెర్టైన్ రిగార్డ్ కేటగిరీకి ముందుగా ఎంపిక చేయబడింది. ప్ర‌శంస‌లు అందాయి. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. హోమ్ బౌండ్ చిత్రాన్ని 14 మంది సభ్యుల జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.

Oscars 2026 – Indian Movie

ఈ సంద‌ర్బంగా చైర్ ప‌ర్స‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇది చాలా కష్టమైన ఎంపిక. ఇవి జీవితాలను తాకిన సినిమాగా అభివ‌ర్ణించారు. జర్నలిస్ట్ బషరత్ పీర్ రాసిన క‌థ‌నం నుండి ప్రేరణ పొందింది హోమ్ బౌండ్ మూవీ. ముస్లిం, దళితుడి మధ్య స్నేహం, గౌరవం, పోలీసులు కావాలనే కలలను నావిగేట్ చేసే బంధాన్ని చిత్రీకరిస్తుంది. హోమ్ బౌండ్ కేన్స్‌లో తొమ్మిది నిమిషాల స్టాండింగ్ ఒవేషన్‌తో ప్రదర్శించారు. సినీ క్రిటిక్స్ పెద్ద ఎత్తున ప్ర‌శంస‌లు కురిపించింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ఘయ్వాన్‌కు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడిగా కూడా అవార్డులను గెలుచుకుంది. టొరంటోలో పీపుల్స్ ఛాయిస్ అవార్డుకు రెండవ రన్నరప్‌గా నిలిచింది. లెజెండరీ ఫిల్మ్ మేకర్ మార్టిన్ స్కోర్సెస్, ఘయ్వాన్ ప్రశంసించారు.

Also Read : Infosys New Innovation : ఉద్యోగం మానేసిన మహిళలకు ‘ఇన్ఫోసిస్’ మంచి అవకాశం

Exit mobile version