Minister Rajnath Singh Shocking Comments : ఆప‌రేష‌న్ సిందూర్ ఆగ‌దు – రాజ్ నాథ్ సింగ్

పార్ల‌మెంట్ సాక్షిగా పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్

Hello Telugu - Minister Rajnath Singh Shocking Comments

Hello Telugu - Minister Rajnath Singh Shocking Comments

Rajnath Singh : ఢిల్లీ – ఆప‌రేష‌న్ సిందూర్ ఆగ‌ద‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. పార్ల‌మెంట్ సాక్షిగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చడం జ‌రిగింద‌న్నారు. ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ, ISI మద్దతు ఉందని ఆరోపించారు. అందుకే వారిని మ‌ట్టు పెట్ట‌డంపై ఫోక‌స్ పెట్టామ‌న్నారు. POKలో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామ‌న్నారు. ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసాం, పాక్ ప్రజలను కాద‌న్నారు రాజ్ నాథ్ సింగ్.

Union Minister Rajnath Singh Key Comments on ‘Operation Sindoor

పాక్ పై దాడి తర్వాత DGMOకు సమాచారం ఇచ్చామ‌న్నారు. పహల్గామ్ లో అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు చంపార‌ని, అందుకే త‌మ స‌త్తా ఏమిటో చూపించామ‌న్నారు. ప్ర‌తిప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌ద‌న్నారు. అమెరికా ఒత్తిళ్ల‌కు తాము త‌ల వంచ లేద‌న్నారు. అవ‌న్నీ అవాస్త‌వాలేన‌ని కొట్టి పారేశారు రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh). కాల్పుల విరమణ ఒత్తిడి లేదన్నారు. తాము అనుకున్న టార్గెట్ ను చేరుకున్నామ‌ని, అందుకే ఆప‌రేష‌న్ సిందూర్ ను నిలిపి వేశామ‌ని ప్ర‌క‌టించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

అమెరికాతో వాణిజ్య చర్చలకు, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణకు మధ్య ఎటువంటి సంబంధం లేదని స్ప‌ష్టం చేశారు. పాకిస్తాన్ తిరిగి గీత దాటాల‌ని ప్ర‌య‌త్నం చేస్తే తిరిగి ఆప‌రేష‌న్ సిందూర్ ను ప్ర‌యోగిస్తామ‌ని ప్ర‌క‌టించారు. భారతదేశం ఎటువంటి అణు బ్లాక్‌మెయిల్‌ను కూడా అంగీకరించదని ఆయన నొక్కి చెప్పారు. అంతే కాదు పాకిస్తాన్ ఓటమిని అంగీకరించిందని, ఆప‌రేష‌న్ ను ఆపాల‌ని కోరింద‌న్నారు.

Also Read : CM Chandrababu – AP Strong Focus : ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ రంగాల‌పై ఏపీ ఫోక‌స్ – సీఎం

Exit mobile version