CM Chandrababu – AP Strong Focus : ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ రంగాల‌పై ఏపీ ఫోక‌స్ – సీఎం

యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర స‌ర్కార్ ఒప్పందం

Hello Telugu - CM Chandrababu - AP Strong Focus

Hello Telugu - CM Chandrababu - AP Strong Focus

CM Chandrababu : సింగ‌పూర్ – ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ రంగాల‌పై ఏపీ స‌ర్కార్ ఫోక‌స్ పెడుతోంద‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). ఆయ‌న సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం అయ్యారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్, ఆరోగ్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగ రత్నం, మాజీ ప్రధాని లీ హ్సియన్ లూంగ్ తోనూ భేటీ అయ్యారు. అలాగే సింగపూర్ లోని వివిధ ప్రాంతాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల బృందం సందర్శించింది. మంగళవారం యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ అకాడమీ ప్రతినిధులు గౌతమ్ ఆనంద్, అజయ్ విద్యాసాగర్, శ్రీనివాస్ సూరపనేనితో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

CM Chandrababu Key Comments on AP Growth

ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత, క్లౌడ్ ఆధారిత సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. మైక్రో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచశ్రేణి కంపెనీ మురాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై తయారీ, రీసెర్చ్ యూనిట్లను ఏపీలో ఏర్పాటు చేసే అంశంపై చర్చలు జరిపారు. ఎయిర్ కండిషనింగ్, కూలింగ్ టెక్నాలజీలో మేటి సంస్థ అయిన క్యారియర్ ప్రతినిధులతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనపై సంప్రదింపులు జరిపారు. ప్రపంచంలోని అతిపెద్ద అగ్రిగల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలలో ఒకటైన విల్మర్ ఇంటర్నేషనల్ సీఈఓ క్వాక్ కూన్ హాంగ్‌తో సమావేశ‌మ‌య్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతుల అవకాశాలపై సీఎం చ‌ర్చించారు.

Also Read : Minister Ponnam Shocking Comments : బీసీల రిజ‌ర్వేష‌న్ల కోసం ఢిల్లీలో ధ‌ర్నా చేస్తాం

Exit mobile version