Popular OpenAI – KTR : ఓపెన్ ఏఐ ఆఫీసు హైద‌రాబాద్ లో ఏర్పాటు చేయాలి

సిఇఓ ఆల్ట్ మ‌న్ ను కోరిన మాజీ మంత్రి కేటీఆర్

Hello Telugu - Popular OpenAI - KTR

Hello Telugu - Popular OpenAI - KTR

KTR : హైద‌రాబాద్ – టెక్నాల‌జీ ప‌రంగా ఎక్క‌డ అవ‌కాశాలు ఉన్నా వెంట‌నే ప‌సిగ‌ట్టేస్తారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయ‌కు సాంకేతిక‌త మీద మంచి ప‌ట్టుంది. అంత‌కుమించి దాని ప‌ట్ల అపార‌మైన అవ‌గాహ‌న కూడా ఉంది. ఈ త‌రుణంలో తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ప్రపంచాన్ని శాసిస్తున్న ఓపెన్ ఏఐ సీఇఓ ఆల్ట్ మాన్. త్వ‌ర‌లో తాను ఇండియాలో ప‌ర్య‌టిస్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు. అంతే కాకుండా ఓపెన్ ఏఐకి సంబంధించి భారీగా పెట్టుబ‌డులు పెడ‌తాన‌ని తెలిపాడు. ఇదే క్ర‌మంలో న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం ప్రారంభించిన ఏఐ మిష‌న్ లో తాను భాగ‌స్వామ్యం కావాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డి ప్ర‌భుత్వంతో చ‌ర్చిస్తాన‌ని, ఓపెన్ ఏఐ కార్యక‌లాపాల‌ను ముందుగా ఇండియా రాజ‌ధాని ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఇది ఈ ఏడాది 2025 డిసెంబ‌ర్ నాటిక‌ల్లా పూర్త‌వుతుంద‌ని చెప్పాడు.

KTR OpenAI Office Should be Set up Hyderabad

దీనిపై స్పందించాడు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). ఢిల్లీలో కాకుండా హైదరాబాద్‌లో ఓపెన్‌ఏఐ కార్యకలాపాలను ఏర్పాటు చేయాలని సామ్ ఆల్ట్‌మన్‌ను కోరారు. నగరం ఇప్ప‌టికే ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, ఏఐ చొరవలతో పాటు గ్లోబల్ టెక్ ఉనికిని క‌లిగి ఉంద‌న్నారు. కృత్రిమ మేధ‌స్సుకు హైద‌రాబాద్ సిటీ కేరాఫ్ గా మారింద‌ని తెలిపారు. దేశంలో ఓపెన్‌ఏఐ ఆశయాలకు సరైన ద్వారంగా హైదరాబాద్ ఉంటుంద‌న్నారు కేటీఆర్. నగరం ఆవిష్కరణలకు శక్తివంతమైన కేంద్రంగా, ఓపెన్ ఏఐ వంటి ప్రపంచ టెక్ లీడర్‌కు మద్దతు ఇవ్వడానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో క‌లిగి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అందుకే వెంట‌నే ఓపెన్ ఏఐ కార్య‌కాల‌పాల‌ను ఇక్క‌డి నుంచి ప్రారంభించాల‌ని కోరారు ఆల్ట్ మ‌న్ ను కేటీఆర్.

Also Read : CBI Searches – Anil Ambani Shocking : అనిల్ అంబానీ కంపెనీల్లో సీబీఐ సోదాలు

Exit mobile version