Anil Ambani : ముంబై – కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది. ముంబైలో అనిల్ అంబానీకి సంబంధించిన పలు కంపెనీలపై సోదాలు చేపట్టింది. తనకు సంబంధించిన నివాసాలలో కూడా దాడులు చేసింది. ఏకకాలంలో కంపెనీలు, నివాసాలలో సోదాలు చేపట్టడంతో ఆయా కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కిస్తులు చెల్లించకుండా ఎగవేసేందుకు ప్లాన్ చేశారంటూ ఆయా బ్యాంకులు ఆర్బీఐని ఆశ్రయించారు. ఇప్పటికే ముందస్తు నోటీసులు జారీ చేశాయి. ఆస్తులను అటాచ్ చేసి వేలం పాట నిర్వహించేందుకు శ్రీకారం చుట్టాయి. దీనిని సవాల్ చేస్తూ అనిల్ అంబానీ (Anil Ambani) కోర్టును ఆశ్రయించాడు. తనను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించాడు.
CBI Searches Anil Ambani Companies
ఈ సమయంలో ఉన్నట్టుండి శనివారం దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగడం సోదాలు చేపట్టడంతో ఖంగు తిన్నాడు అనిల్ అంబానీ. అయితే తాజాగా బ్యాంకుకు రూ. 2 వేల కోట్లు మోసగించిన కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రమోటర్ అంబానీతో పాటు ఆ సంస్థ కార్యాలయాల్లో సీబీఐ దాడులు చేపట్టింది. ఇందులో భాగంగా ముంబయిలోని అనిల్ అంబానీ నివాసంతో పాటు ఆరు చోట్ల తనిఖీలు జరిపింది. బ్యాంక్ రుణం దుర్వినియోగం, తీసుకున్న రుణాల దారి మళ్లింపు నకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ ఆధారాలను సేకరించింది సీబీఐ. జూన్ 13వ తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. తీసుకున్న రుణాన్ని చెల్లించడం లేదని, ఇది మోస పూరిత చర్య అని ఆరోపించింది. తను మోసానికి పాల్పడ్డాడని ఆరోపించింది. దీంతో సీబీఐ కేసు నమోదు చేసింది.
Also Read : S Jaishankar Fired on America : అమెరికా సుంకాలపై జై శంకర్ సీరియస్
