మ‌రోసారి సంజు శాంస‌న్ కు నో ఛాన్స్

వ‌న్డే , టెస్టు జ‌ట్ల‌ను ప్ర‌క‌టించిన బీసీసీఐ

hellotelugu-SanjuSamson

ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ప‌ట్ల బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ మ‌రోసారి త‌న వివ‌క్ష‌ను చూపించింది. తాజాగా ముంబై వేదిక‌గా కీల‌క స‌మావేశం జ‌రిగింది. వ‌న్డేతో పాటు టెస్టు జ‌ట్టుకు శుభ్ మ‌న్ గిల్ ను కెప్టెన్ గా ప్ర‌క‌టించింది. త‌న‌కు తోడుగా కేఎల్ రాహుల్ కు ఛాన్స్ ఇచ్చింది. కానీ అద్భుత‌మైన ఫామ్ తో కొన‌సాగుతూ వ‌స్తున్న శాంస‌న్ కు మాత్రం ఈసారి కూడా వ‌న్డే టీంలో ఛాన్స్ ద‌క్క‌లేదు. దీనిపై మాట్లాడేందుకు నిరాక‌రించాడు బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్. శాంస‌న్ గ‌నుక ఆడ‌క పోయి ఉండి ఉంటే ఈ ఏడాది ఇండియా, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హించిన ఐపీఎల్ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 గెలిచి ఉండేది కాదు. క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో కోల్ క‌తా లో విండీస్ పై 97 ర‌న్స్ చేశాడు.

జ‌ట్టును గ‌ట్టెక్కించాడు. సెమీ ఫైన‌ల్ లో ముంబైపై 89 ర‌న్స్ చేసి కీల‌క పాత్ర పోషించాడు. ఆపై అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో మ‌రోసారి 89 ప‌రుగులు చేసి స‌త్తా చాటాడు. దీంతో ఇండియా అరుదైన రికార్డు న‌మోదు చేసింది. ఒక జ‌ట్టు వ‌రుసగా వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం త‌న వ‌ల్ల‌నేన‌ని యావ‌త్ దేశం పేర్కొంది. ఈ టోర్నీ త‌ర్వాత సంజు శాంస‌న్ నేష‌న‌ల్ హీరోగా మారి పోయాడు. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు త‌న ప‌ట్ల బీసీసీఐ ఎందుక‌నో ప‌క్క‌న పెడుతూ వ‌స్తోంది. త‌న‌కు బ‌దులు వికెట్ కీప‌ర్ గా ఇషాన్ కిష‌న్ కు ఛాన్స్ ఇచ్చింది. దీంతో శాంస‌న్ ఫ్యాన్స్ బీసీసీఐ ఎంపిక చేయ‌క పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Exit mobile version