ఒడిశా స‌ర్కార్ ప్ర‌జ‌ల‌పై వివ‌క్ష త‌గ‌దు

మాజీ ముఖ్య‌మంత్రి నవీన్ ప‌ట్నాయ‌క్

hellotelugu-NavinPaatnaik

భువ‌నేశ్వ‌ర్ : ఒడిశాలో కొలువు తీరిన బీజేపీ ఎన్డీయే స‌ర్కార్ నిర్వాకంపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్. మంగళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌త్యేకంగా ప్ర‌స్తుత స‌ర్కార్ ప్ర‌జ‌ల బాగోగుల గురించి ప‌ట్టించుకోక పోవ‌డం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల కోసం తాము ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేయ‌డం జ‌రిగింద‌న్నారు న‌వీన్ ప‌ట్నాయ‌క్. బిజు జనతాదళ్ (బిజెడి) అధినేత, ఒడిశా ఎల్ఓపి నవీన్ పట్నాయక్ చేసిన వ్యాఖ్య‌లు అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

ప్ర‌జ‌ల ప‌ట్ల బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు . ఈ స‌మ‌యంలో తీసుకునే నిర్ణ‌యాల‌పైనే ఎక్కువ‌గా జ‌నం ఆశ ప‌డుతార‌ని, అలాగ‌ని వారి మేలు కోర‌కుండా ఉండ‌టం అనేది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు న‌వీన్ ప‌ట్నాయ‌క్. ఈ విష‌యం తెలుసుకున్న‌ప్ప‌టి నుంచి తాను నిద్ర పోవ‌డం లేదన్నారు. ఒడిశా రాష్ట్రం దేశానికే రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేందుకు తాను శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నం చేశాన‌ని చెప్పారు. కానీ ప్ర‌జ‌లకు ఏం కావాల‌నే దానిపై ఎన్నిక‌ల సంద‌ర్భంగా చెప్ప‌డంలో అంత‌గా స‌క్సెస్ కాలేక పోయామ‌ని ఒప్పుకున్నారు మాజీ ముఖ్య‌మంత్రి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎటువంటి ఖర్చు చేయడం లేదని మన రాష్ట్రంలో చాలా మంది అంటున్నారని వాపోయారు. ప్ర‌భుత్వం అన్నాక పూర్తి బాధ్య‌త‌తో ఉండాల‌న్నారు న‌వీన్ ప‌ట్నాయ‌క్.

Exit mobile version