అమెరికా తీరుపై ఉత్త‌ర కొరియా ఫైర్

వెనుజులా మ‌దురోసు వ్య‌వ‌హారంపై

hellotelugu-KimJong

ఉత్త‌ర కొరియా : పెద్ద‌న్న అమెరికా వెనుజులా దేశానికి సంబంధించిన మ‌దురోసును బందీగా ప‌ట్టుకోవ‌డం ప‌ట్ల తీవ్రంగా స్పందించింది ఉత్త‌ర కొరియా. ఆదివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దీనిని పూర్తిగా ఖండిస్తున్నామ‌ని పేర్కొంది. ఇది అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొంది. దీనిని తాము ఒప్పుకోమ‌ని ప్ర‌క‌టించింది. మదురోను అమెరికా స్వాధీనం చేసుకోవడం ఆసియా సార్వభౌమాధికారంపై తీవ్రమైన దాడి అని ఉత్తర కొరియా ఖండించింది .ఈ సంఘటన అమెరికా క్రూరమైన స్వభావాన్ని మరోసారి స్పష్టంగా ధృవీకరించే మరొక ఉదాహరణ అని ప్యోంగ్యాంగ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మదురో తొలగింపును సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ ఐక్యరాజ్యసమితి చార్టర్ , అంతర్జాతీయ చట్టాలను ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించడం వారి ప్రధాన ఉద్దేశ్యం అని ఆరోపించింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా స్వాధీనం చేసుకోవడాన్ని ఉత్తర కొరియా ఆదివారం సార్వ భౌమాధికారంపై తీవ్రమైన దాడి అని ఖండించింది. వెనిజులాలో అమెరికా ఆధిపత్యం కోరుకునే చర్యను తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. మదురో తో పాటు ఆయ‌న భార్యను హెలికాప్టర్ ద్వారా న్యూయార్క్ నగరానికి తరలించారు. అక్కడ వారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అమెరికా ప్రత్యేక దళాలు స్వాధీనం చేసుకున్నాయి. వెనిజులా రాజధాని కారకాస్చు, ట్టుపక్కల ప్రాంతాలపై వైమానిక దాడులు జరిగాయి.

Exit mobile version