SP Ratna : పుట్టపర్తి జిల్లా – దేశ వ్యాప్తంగా కలకలం రేపింది నూర్ మహమ్మద్ అరెస్ట్ వ్యవహారం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు పుట్టపర్తి జిల్లా ఎస్పీ రత్న (SP Ratna). ఆదివారం మీడియాతో మాట్లాడారు. దేశ సమగ్రతకు అవరోధం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న సమాచారంతో శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో నూర్ మహమ్మద్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. ఉపా చట్టం కింద నిందితులను అరెస్టు చేశామన్నారు. వీరిద్దరూ నిషేధిత వాట్సప్ గ్రూపుల్లో సమాచారం షేర్ చేసినట్లు గుర్తించామన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయన్న అనుమానంతో ధర్మవరంలోని కోటకు చెందిన నూర్ మహమ్మద్‌ను ధర్మవరం పోలీసులు శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
SP Ratna Key Comments
ఈ కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి కడప జైలుకు తరలించామని చెప్పారు. పాక్‌కు చెందిన వాట్సప్ గ్రూపుల్లో నిందితుడు సభ్యుడిగా ఉన్నాడని తెలిపారు. నూర్ మహమ్మద్ చికెన్ బిర్యానీ తయారు చేస్తూ.. అమాయకుడిలా కనిపిస్తాడని చెప్పారు. మసీదు వద్ద యువకులకు సమాచారం చేర వేస్తున్నాడని, ఆ విషయం విచారణలో తేలిందన్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అతడిని అరెస్టు చేశామన్నారు ఎస్పీ. కస్టడీలోకి తీసుకొని విచారిస్తామన్నారు. ఇతర గ్రూపులతో సంబంధాలపైనా ఆరా తీస్తామన్నారు. అతడు ఉగ్రసంస్థ శిక్షణకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. నిషేధిత వాట్సప్ గ్రూప్‌లు 6, పాక్‌కు చెందిన మరో 30 గ్రూపుల్లో అతడు సభ్యుడిగా ఉన్నాడని ఎస్పీ రత్న వెల్లడించారు.
Also Read : Popular Actor Suresh Gopi : ఓటర్ల జాబితా తారుమారు అబద్దం
