Nobel Prize : స్వీడన్ : నిన్నటి దాకా తనకే నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ఆశ పడిన ట్రంప్ కు బిగ్ షాక్ ఇచ్చింది నోబెల్ ఎంపిక కమిటీ. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. తనను పక్కన పెట్టింది. వెనీజులా ప్రజాస్వామ్య హక్కులను పెంపొందించడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన మరియా కొరీనా మచాడోకు శాంతి పురస్కారం ఇస్తున్నట్లు ప్రకటింది. నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యం కోసం ఆమె చేసిన పోరాటం అద్వితీయం అని ఈ సందర్బంగా పేర్కొంది. ఇందులో భాగంగా 2025 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని (Nobel Prize) మరియా కొరినా మచాడోకు అందించాలని నిర్ణయించినట్లు తెలిపింది నార్వేజియన్ నోబెల్ కమిటీ.
Nobel Prize Winner
నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలకు 11 మిలియన్ స్వీడిష్ క్రోనర్ దక్కుతుంది. స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త , ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ కోరికల ప్రకారం 1901లో స్థాపించారు నోబెల్ బహుమతులను. మానవజాతికి గొప్ప ప్రయోజనం చేకూర్చిన వ్యక్తులు లేదా సంస్థలను సత్కరిస్తాయి. ఈ అవార్డులు ఆరు విభాగాలలో ఉన్నాయి. సైన్స్, సాహిత్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శరీరధర్మ శాస్త్రం లేదా వైద్యం ,ఆర్థిక శాస్త్రాలలో ఎంపిక చేస్తూ వస్తున్నారు. తన మరణానికి ఒక సంవత్సరం ముందు నవంబర్ 27, 1895న తన వీలునామాపై సంతకం చేశారు ఆల్ఫ్రెడ్ నోబెల్ . తన సంపదలో ఎక్కువ భాగాన్ని పురస్కార గ్రహీతలకు ఇవ్వాలని కోరాడు. ఆ మేరకు కొన్నేళ్లుగా వీటిని ప్రకటిస్తూ వస్తున్నారు.
Also Read : Harish Rao Fired on CM Revanth : రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు పిల్లి : హరీశ్ రావు
