ప్ర‌భుత్వ బ‌డుల్లో రాజ‌కీయ పార్టీల‌కు నో ఎంట్రీ

నిషేధం విధించిన త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం

Hellotelugu-CMVijay

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి రాజకీయ పార్టీల ప్రవేశంపై నిషేధం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతేకాదు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు, వారి కార్యక్రమాలపై కూడా బ్యాన్ ఉంటుంద‌ని పేర్కొన్నారు. తరగతి గదులు చదువు కోవడానికేన‌ని వెల్ల‌డించారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు, ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల్లోకి ప్రవేశించకుండా, అక్కడ కార్యక్రమాలు నిర్వహించకుండా నిషేధించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే ఏ కార్యక్రమాలైనా తటస్థతచ‌ విద్యాపరమైన ప్రాసంగికత సూత్రాలకు కట్టుబడి ఉండాలని ఆ ప్రభుత్వ సర్క్యులర్ పేర్కొంది.

విద్యా సంస్థలు చదువుకోవడానికే కానీ రాజకీయ కార్యకలాపాల కోసం కాదని నొక్కి చెబుతూ, రాజకీయ పార్టీల కార్యకర్తలు, ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల్లోకి ప్రవేశించడం దారుణ‌మ‌ని పేర్కొన్నారు సీఎం. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యే ఎన్నికైన ప్రతినిధులను మాత్రమే పాఠశాలలు, తరగతి గదుల్లోకి అనుమతిస్తారని పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ చెప్పారు. తరగతి గదులు విద్యాభ్యాసానికి కేటాయించిన ప్రదేశాలని, రాజకీయ నాయకులను లేదా వ్యక్తులను పొగిడే కార్యకలాపాలకు వాటిని ఉపయోగించ రాదని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. పాఠశాలలు నేర్చుకునే ప్రదేశాలు, ఎవరినీ పొగడ్తలతో ముంచెత్తేవి కావు అని సీఎం స్ప‌స్టం చేశార‌న్నారు.

Exit mobile version