హైదరాబాద్ : ప్రముఖ హాస్య నటుడు కన్నెగంటి బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనపై తన సోదరుడు వదన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కలకలం రేపాయి. తనను పట్టించు కోవడం లేదంటూ పేర్కొన్నారు. దీనిపై స్పందించారు స్వయంగా బ్రహ్మానందం. తమ మధ్య ఎలాంటి అపార్థాలు లేదా గొడవలు లేవని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారం త్వరలోనే సద్దు మణుగుతుందని భావిస్తున్నారు సినీ వర్గాలు. తమ మధ్య సంభాషణ లోపం ఉందంటూ సోదరుడు వదన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, తనకూ తన అన్నయ్య వదన్‌కూ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రముఖ హాస్యనటుడు పేర్కొన్నారు. ఈ విషయంపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు బ్రహ్మానందం ఒక వీడియోను విడుదల చేశారు; తన సోదరుడిని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన కోరారు.
అందుకే ఈ వివరణ ఇస్తున్నాను. నేను ఆ వార్తను చూశాను. మీడియా , కొందరు వ్యక్తులు పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకున్నారు, అందుకే స్పష్టత ఇవ్వాలనుకున్నాను అని ఆయన అన్నారు. గత కొన్నేళ్లుగా తాను వదన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నానని, ఆ వీడియో గురించి తామిద్దరం చర్చించుకున్నామని వెల్లడించారు. మేమిద్దరం దాని గురించి మాట్లాడుకుని నవ్వుకున్నాం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని ఆయన చెప్పారు. ఆ వార్తలు చూసిన తర్వాత వదన్ స్వయంగా ఆందోళన చెందారని, తమ బంధం ఇప్పటికీ దృఢంగానే ఉందని ఆయన పునరుద్ఘాటించారు. సోదరుల మధ్య అనుబంధం బాగుందని, తమ మధ్య ఎలాంటి సమస్య లేదని బ్రహ్మానందం స్పష్టం చేశారు. అంతకు ముందు వదన్ తెలుగు వార్తా ఛానెళ్లతో మాట్లాడుతూ తన తమ్ముడితో సంభాషణ లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.
తమ తోబుట్టువులలో నలుగురు చని పోయారని, ఇప్పుడు తామిద్దరం మాత్రమే మిగిలామని ఆయన చెప్పారు. ప్రస్తుతం తాను స్వగ్రామంలో ఒంటరిగా ఉంటున్నానని, బ్రహ్మానందం తన యోగక్షేమాలు అడగక పోవడం లేదా కనీసం ఫోన్ చేయక పోవడం తనను బాధించిందని వదన్ పేర్కొన్నారు. అతను ఇటీవల ఊరికి వచ్చాడు కానీ కనీసం పలకరించకుండానే వెళ్లిపోయాడు. అన్నయ్యా, ఎలా ఉన్నావు? అని నా తమ్ముడు ఎప్పటికైనా ఫోన్ చేసి అడుగుతాడేమోనని ఆశగా ఎదురుచూస్తుంటాను. కానీ అతను ఎప్పుడూ నాకు ఫోన్ చేయడు అని వదన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పెద్ద నటుడు. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండవచ్చు, కానీ నాకు ఫోన్ చేయడానికి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు నిమిషాలు కేటాయించగలరు కదా అని ఆయన అన్నారు .
