Rizwan : పాకిస్తాన్ – పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ జట్టుకు సారథ్యం వహించడమే కాకుండా ఎనలేని విజయాలు సమకూర్చి పెట్టిన , కీలక పాత్ర పోషించిన టాప్ వరల్డ్ క్లాస్ క్రికెటర్లు బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ లకు ఝలక్ ఇచ్చింది. త్వరలో జరిగే ఆసియా కప్ లో పాల్గొనే పాకిస్తాన్ స్క్వాడ్ లో వీరికి చోటు కల్పించక పోవడం క్రికెట్ ఫ్యాన్స్ ను విస్తు పోయేలా చేసింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ వసీం, ఎడమచేతి వాటం బౌలర్ సల్మాన్ మీర్జాతో కూడిన జట్టును పిసిబి ప్రకటించింది.
Pakistan Cricket Board Shocking Rizwan
కాగా ఈ నెల చివర్లో యుఎఇలో జరిగే ట్రై-సిరీస్ తర్వాత ఆసియా కప్ కోసం 17 మంది సభ్యుల జట్టును ప్రకటించారు పాకిస్తాన్ (Rizwan) సెలెక్టర్లు . ఆదివారం పీసీబీ అధికారికంగా వెల్లడించారు. అనుభవజ్ఞులైన బ్యాటర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్‌లను పక్కన పెట్టారు. సెప్టెంబర్ 9 నుండి యూఏఈలో T20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్‌కు ముందు, సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని జట్టు ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు షార్జాలో ఆఫ్ఘనిస్తాన్ , ఆతిథ్య యూఏఈ జట్టుతో ముక్కోణపు సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 9 నుండి 28 వరకు జరిగే ఎనిమిది జట్ల ఆసియా కప్ టోర్నమెంట్‌లో UAE , ఒమన్‌లతో కూడిన గ్రూప్ Aలో చిరకాల ప్రత్యర్థి భారతదేశంతో పాటు పాకిస్తాన్ కూడా ఉంది.
ఇక ప్రకటించిన పాక్ జట్టు ఇలా ఉంది. సల్మాన్ అలీ ఆఘా (సి), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరిస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ హరిస్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ వసీం జూనియర్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ షా అఫ్రిది, సుఫ్యాన్ మోకిమ్.
Also Read : TG Viswa Prasad Interesting Comments : కార్మికులకు పెండింగ్ వేతనాల చెల్లింపు
