TG Viswa Prasad : హైదరాబాద్ – 30 శాతం వేతనాలు చెల్లించాలని కోరుతూ ఆందోళన బాట పట్టిన సినీ కార్మికులపై నోరు పారేసుకుని సంచలనంగా మారిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ (TG Viswa Prasad) కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి దాకా ఉన్న పెండింగ్ వేతనాలను కార్మికులకు నేరుగా చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే బకాయిలలో గణనీయమైన భాగాన్ని చెల్లించామని చెప్పారు. ఇకపై కార్మికులకు పారదర్శకతను నిర్ధారించడానికి వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం తను డార్లింగ్ ప్రభాస్, మాళవిక మోహన్ తో కలిసి మారుతి ప్రసాద్ దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇదే ఏడాది తాను నిర్మించిన హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన రవితేజ, భాగ్యశ్రీ భోర్సేతో తీసిన మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది.
TG Viswa Prasad Key Comments
తాజాగా కార్మికుల పెండింగ్ చెల్లింపులపై ఆందోళనలను పరిష్కరించేందుకు తాను రెడీగా ఉన్నామని చెప్పారు విశ్వ ప్రసాద్. ఇక నుంచి ఎవరికీ వేతనాల చెల్లింపులో జాప్యం అనేది ఉండదన్నారు. ఎలాంటి అనుమానించాల్సిన అవసరం లేదన్నారు. రిజిస్టర్ చేసుకున్న సినీ కార్మికులకు సంబంధించి వారి బ్యాంకు ఖాతాలలోనే జమ చేస్తామన్నారు. దీని వల్ల ఎలాంటి ఆలస్యం ఉండదని, అంతే కాకుండా పూర్తి పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు అవుతుందన్నారు విశ్వ ప్రసాద్. కాగా రోజువారీ వేతన కార్మికులకు సుమారు రూ. 60 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. జూలైలో పని చేసిన షెడ్యూల్‌లకు దాదాపు రూ. 1 కోటి పెండింగ్‌లో ఉందన్నారు. నెలవారీ కాంట్రాక్ట్ అసోసియేట్‌లకు మరో రూ. 30 కోట్లు ఖర్చు చేసినట్లు కూడా పేర్కొన్నారు.
Also Read : Kerala Top in Digital Litaracy Interesting : డిజిటల్ అక్షరాస్యతలో కేరళ టాప్
