Nitish Kumar Oath Interesting : బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం

హాజ‌రైన ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రులు, సీఎంలు

Hello Telugu - Nitish Kumar Oath Interesting

Hello Telugu - Nitish Kumar Oath Interesting

Nitish Kumar : పాట్నా : బీహార్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా మ‌రోసారి కొలువు తీరారు నితీష్ కుమార్ (Nitish Kumar). ఆయ‌న వ‌రుస‌గా గ‌త 20 ఏళ్లుగా ఆ రాష్ట్రానికి సీఎంగా ప‌ని చేస్తూ వ‌చ్చారు. ఈసారి రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఏకంగా 203 సీట్లు సాధించింది. ఎవ‌రు సీఎం అవుతార‌నే ఉత్కంఠ‌కు తెర దించుతూ నితీష్ కుమార్ తాను కింగ్ మేక‌ర్ న‌ని నిరూపించారు. ఆయ‌న కొంత కాలం నుంచి సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తూ వచ్చారు. గురువారం బీహార్ రాష్ట్ర రాజ‌ధాని పాట్నాలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌తో గ‌వ‌ర్న‌ర్ అరీఫ్ మ‌హ‌మ్మ‌ద్ ఖాన్ ప్ర‌మాణం చేయించారు .విచిత్రం ఏమిటంటే బీహార్ సీఎంగా నితీష్ కుమార్ రికార్డ్ స్థాయిలో 10 సార్లు ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇది అరుదైన రికార్డ్ కావ‌డం విశేషం.

Nitish Kumar oath As a Bihar CM Again

ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, కూట‌మి భాగ‌స్వామ్య పార్టీల అధినేత‌లు, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా సీఎంగా కొలువు తీరిన సుశేన్ బాబును అభినందించారు. ఇదిలా ఉండ‌గా బీహార్ కేబినెట్ మంత్రులుగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు విజ‌య్ కుమార్ చౌద‌రి, బిజేంద్ర ప్ర‌సాద్ యాద‌వ్ , శ్ర‌వ‌ణ్ కుమార్ , మంగ‌ళ్ పాండే, దిలీప్ కుమార్ జైస్వాల్ , అశోక్ చౌదరి , లేసి సింగ్, మదన్ సాహానీ , కేడీ సంతోష్ కుమార్ సుమ‌న్, సునీల్ కుమార్ ప్ర‌మాణం చేశారు.

Also Read : Supreme Court-Rahul Gandhi Case Sensational : రాహుల్ గాంధీ కేసు విచార‌ణపై స్టే పొడిగింపు

Exit mobile version