యూఎస్ వర్క్ వీసా నిబంధనల మార్పు స‌బ‌బే

స‌మ‌ర్థించిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి

hellotelugu-MMaarcoRubio

న్యూఢిల్లీ : అమెరికా మ‌రోసారి బాంబు పేల్చింది. యూఎస్ వర్క్ వీసా నిబంధనల మార్పులను సమర్థించారు యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో .తన భారత పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అమెరికా తన కార్మికులకు , జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తోందని రూబియో అన్నారు. వీసా నిబంధనలలో ఇటీవలి మార్పుల గురించి భారతదేశంలో ఉన్న ఆందోళనలను తగ్గించడానికి ప్రయత్నించారు. అమెరికా తన కార్మికులకు , జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తోందని రూబియో అన్నారు. ఇది భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించ బడింది కాదు. ఇది భారతదేశంపై దృష్టి సారించింది కాదు… ఇది యునైటెడ్ స్టేట్స్‌కు వచ్చి పని చేయాలనుకునే భారతీయులను ప్రభావితం చేస్తుందన్నారు. మా వ్యాపారాలు వారిని తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నాయి, కానీ ఇది భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని చెప్పారు.

ఇది ప్రపంచ వ్యాప్తమైనదని, ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు రూబియో. అమెరికాలో వలస విధానం లోప భూయిష్టంగా ఉంద‌న్నారు. త‌మ వ్యాపార సంబంధిత వలస కార్యక్రమాలు చాలా సందర్భాల్లో విపరీతమైన మోసాలకు, దుర్వినియోగానికి గురయ్యాయని ఆరోపించారు. వాటిని అర్థం పర్థం లేని రీతిలో దుర్వినియోగం చేశారని మండిప‌డ్డారు. కాబట్టి ఈ విషయాలను పరిష్కరించాలన్నారు. మేము వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. కానీ అవి భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్నవి కావు అని మ‌రోసారి రూబియో స్ప‌ష్టం చేశారు. అవి ప్రపంచంలోని ఏ దేశానికైనా వర్తిస్తాయని అన్నారు. ఇదిలా ఉండ‌గా అక్టోబర్ 9న అమెరికా ప్రభుత్వం శాశ్వత కార్మిక ధృవీకరణ కార్యక్రమం (గ్రీన్ కార్డ్) నుండి ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద ఐటీ అవుట్‌సోర్సింగ్ సంస్థలైన కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సిఎల్, క్యాప్‌జెమినిలను సస్పెండ్ చేసింది. అనేక క్రియాశీల ఫెడరల్ దర్యాప్తుల కారణంగానే ఈ సస్పెన్షన్ విధించినట్లు అమెరికా కార్మిక శాఖ పేర్కొంది.

Exit mobile version