Supreme Court-Rahul Gandhi Case Sensational : రాహుల్ గాంధీ కేసు విచార‌ణపై స్టే పొడిగింపు

స్ప‌ష్టం చేసిన భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం

Hello Telugu - Supreme Court-Rahul Gandhi Case Sensational

Hello Telugu - Supreme Court-Rahul Gandhi Case Sensational

Rahul Gandhi : న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఊర‌ట ల‌భించింది. సైనికుల గురించి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికే సుప్రీంకోర్టులో కేసు విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్బంగా చీవాట్లు పెట్టింది. దేశ భ‌ద్ర‌త‌కు సంబంధించి విధులు నిర్వ‌హిస్తున్న వారి ప‌ట్ల మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికింది. ఎల్ఓపీ కేసులో ట్ర‌య‌ల్ కోర్టు స‌మ‌న్లు జారీ చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ అల‌హాబాద్ హైకోర్టు మే 29న ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఈ ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేస్తూ రాహుల్ గాంధీ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ప్ర‌ధానంగా త‌న‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూ మ‌రో పిటిష‌న్ దాఖ‌లైంది. 2022లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా భార‌త సైన్యంపై అవ‌మాన‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

Rahul Gandhi Case Trail Updates

త‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ కేసు న‌మోదైంది. త‌న‌ను శిక్షించాల‌ని కోరుతూ పిటిషన్ దాఖ‌లైంది. కాగా ఈ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విచారణను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు గురువారం తన మధ్యంతర ఉత్తర్వును డిసెంబర్ 4 వరకు పొడిగించింది. న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్‌, స‌తీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. భార‌త దేశంలోని 2,000 చ‌ద‌ర‌పు కిలోమ‌ట‌ర్ల భూ భాగాన్ని చైనా ఆక్ర‌మించింద‌ని మీకు ఎలా తెలిసింది. అలా ఆక్ర‌మించుకున్న స‌మ‌యంలో మీరు అక్క‌డ ఉన్నారా . ఉంటే మీరు ఎందుకు అభ్యంత‌రం తెలియ చేయ‌లేక పోయారు..మీ ద‌గ్గ‌ర ఇందుకు సంబంధించిన విశ్వ‌స‌నీయ‌మైన స‌మాచారం , లేక ఆధారాలు ఉన్నాయా అని సీరియ‌స్ కామెంట్స్ చేసింది ధ‌ర్మాస‌నం గ‌తంలో విచారించిన స‌మయంలో రాహుల్ గాంధీని ఉద్దేశించి.

Also Read : YS Jagan Appears Nampally Court Sensational : నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రైన వైఎస్ జ‌గ‌న్ రెడ్డి

Exit mobile version