Popular Minister Nimmala Ramanaidu Top : మంత్రుల ప‌నితీరులో నిమ్మ‌ల నెంబ‌ర్ వ‌న్

2వ స్థానంలో నిలిచిన మంత్రి నారా లోకేష్

Hello Telugu - Popular Minister Nimmala Ramanaidu Top

Hello Telugu - Popular Minister Nimmala Ramanaidu Top

Nimmala Ramanaidu : అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మంత్రులు, ఎమ్మెల్యేల ప‌నితీరు గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఆరా తీస్తున్నారు. తాజాగా మంత్రివ‌ర్గంలో కొలువు తీరిన మంత్రుల ప‌నితీరు గురించి ప్ర‌త్యేకంగా ర్యాంకుల‌ను ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన జాబితాలో మ‌రోసారి స‌త్తా చాటారు రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు (Nimmala Ramanaidu) నిలిచారు.

MInister Nimmala Ramanaidu No 1

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు , ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఊహించ‌ని విధంగా 2వ స్థానంలో ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక 3వ స్థానంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్, 4వ స్థానంలో రాష్ట్ర హోం , ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, 5వ స్థానంలో రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ ఉన్నార‌ని వెల్ల‌డించారు ముఖ్య‌మంత్రి.

ఇదిలా ఉండ‌గా ప్ర‌క‌టించిన‌ జాబితాలో అట్టడుగున నిలిచారు విద్యుత్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు, ఆర్థిక , శాస‌న స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు.ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం నారా చంద్రాబు నాయుడు. ఇక నుంచి మంత్రులు మ‌రింత ప‌నితీరును మార్చుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. లేక పోతే చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంద‌ని సుతిమెత్తగా హెచ్చ‌రించారు. ఈ ర్యాంకులకు సంబంధించి తెలుగు దేశం పార్టీలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది.

Also Read : Minister Ram Prasad Interesting Update : ఆంధ్రా యువ సంక‌ల్ప్ – 2025 ప్ర‌తిభ‌కు వేదిక

Exit mobile version