Nikki Haley : అమెరికా – ఐక్యరాజ్య సమితిలో మాజీ అమెరికా రాయబారి నిక్కీ హేలీ (Nikki Haley) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఇండియాకు నష్టం కలిగించవని అది మన దేశంపై ఎక్కువగా ప్రభావం చూపుతుందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇరు దేశాల మధ్య బంధాలు మరింత బలోపేతం కావాలని సూచించారు. చైనా ప్రత్యర్థి కాదని, దానిని విలువైన స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య భాగస్వామిగా పరిగణించాలని ఆమె అన్నారు. పదే పదే సుంకాలు విధించడం వల్ల నష్టం జరిగేది అమెరికాకేనని హెచ్చరించారు. ఎవరి ప్రోద్భలంతో, ఎందుకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారో ట్రంప్ కే తెలియాలని పేర్కొన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని అభిప్రాయం వ్యక్తం చేశారు నిక్కీ హేలీ.
Nikki Haley Slams Donald Trump
ప్రజాస్వామ్య భారతదేశం పెరుగుదల కమ్యూనిస్ట్ నియంత్రణలో ఉన్న చైనా వలె కాకుండా స్వేచ్ఛా ప్రపంచాన్ని బెదిరించదని నొక్కి చెప్పారు. భారతదేశాన్ని విలువైన స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య భాగస్వామిగా పరిగణించాలని సూచించారు. చైనా లాంటి ప్రత్యర్థి కాదన్నారు. విచిత్రం ఏమిటంటే రష్యా నుంచి చమురు కొనుగోళ్లలో అత్యధిక శాతం చైనా తీసుకుంటోందని, కానీ మినహాయింపు పొందడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికాకు చైనాతో కంటే ఇండియాతోనే ఎక్కువ వ్యాపార అవకాశాలు ఉంటాయని అభిప్రాయ పడ్డారు నిక్కీ హేలీ.. ఆసియాలో చైనా ఆధిపత్యానికి ప్రతిఘటనగా పని చేయగల ఏకైక దేశంతో 25 సంవత్సరాల వేగాన్ని తగ్గించడం వ్యూహాత్మక విపత్తు అవుతుంది అని హేలీ హెచ్చరించారు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను.
Also Read : S Jaishankar India-Russia Strong Relation : భారత్ రష్యా వాణిజ్యం బలోపేతం కావాలి
