Niharika Konidela Success – Committee Kurrollu : సైమా అవార్డుల్లో క‌మిటీ కుర్రోళ్లు హ‌ల్ చ‌ల్

నిర్మాత‌గా నిహారిక కొణిద‌ల కు బిగ్ హ్యాపీ

Hello Telugu - Niharika Konidela Success - Committee Kurrollu

Hello Telugu - Niharika Konidela Success - Committee Kurrollu

Niharika Konidela :సైమా అవార్డుల‌లో త‌ళుక్కున మెరిసింది క‌మిటీ కుర్రోళ్లు చిత్రం. దీనిని ప్ర‌ముఖ న‌టుడు నాగ‌బాబు కూతురు నిహారిక కొణిద‌ల నిర్మించింది. ఈ సినిమాకు రెండు అవార్డులు ద‌క్కాయి. చిత్రాన్ని నిర్మించినందుకు గాను నిహారిక కొణిదెల (Niharika Konidela) ఉత్తమ తొలి నిర్మాతగా, సందీప్ సరోజ్ ఉత్తమ తొలి నటుడిగా ఎంపిక చేసింది సైమా జ్యూరీ. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌లపై, నిర్మాతలు పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని సమర్పించారు, ఇది విడుదలైనప్పటి నుండి సంచలనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత ఈ చిత్రం రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచు కోవడం ద్వారా తన విజయ పరంపరను కొనసాగించింది.

Niharika Konidela Gets Award

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులలో జాతీయ సమైక్యత, మత సామరస్యం , పేదల సామాజిక అభ్యున్నతి అనే ఇతి వృత్తాలను హైలైట్ చేసినందుకు కమిటీ కుర్రోళ్లు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా గుర్తింపు పొందింది. దర్శకుడు యధు వంశీ ఉత్తమ తొలి దర్శకుడిగా సత్కరించబడ్డారు. ఆ త‌ర్వాత గామా అవార్డుల‌లో కూడా త‌ళుక్కున మెరిసింది క‌మిటీ కుర్రోళ్లు చిత్రం. నిహారిక కొణిదెల ఉత్తమ తొలి నిర్మాత అవార్డును అందుకోగా యధు వంశీ మరోసారి ఉత్తమ తొలి దర్శకుడి పుర‌స్కారం అందుకున్నారు. కమిటీ కుర్రోళ్లు మూవీని నిర్మాత‌లు రూ. 9 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా విడుద‌ల‌య్యాక రూ. 18.5 కోట్లు థియేట‌ర్ల ద్వారా రాబ‌ట్ట‌గా నాన్ థియేట్రిక‌ల్ ప‌రంగా రూ. 6 కోట్లు వ‌సూలు చేసింది. మొత్తంగా రూ. 24.5 కోట్లు కొల్ల‌గొట్టింది.

Also Read : Bandlaguda Laddu Sensational : దేశంలోనే బండ్ల‌గూడ ల‌డ్డూ రికార్డ్

Exit mobile version