NIA Raids Sensational : దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు – ఐసిస్‌ కుట్రపై విచారణ వేగం

ఐదు రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్‌లో కలిపి 21 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి...

Hello Telugu - NIA Raids Sensational

Hello Telugu - NIA Raids Sensational

NIA : ఉగ్రవాద కుట్ర కేసులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోమవారం దేశవ్యాప్తంగా విస్తృత సోదాలు నిర్వహించింది. ఐసిస్‌తో పాటు ఇతర ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న కేసులో భాగంగా ఐదు రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్‌లో కలిపి 21 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి.

NIA Raids

అధికారుల సమాచారం ప్రకారం, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్‌లోనూ సోదాలు జరిగాయి. ఈ క్రమంలో పలు డిజిటల్‌ పరికరాలు, మొబైల్‌ ఫోన్లు, అనుమానాస్పద పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలోని కయార్‌ పోలీసుల వద్ద ప్రారంభమై, ఈ ఏడాది జూన్‌లో ఎన్‌ఐఏకి బదిలీ అయ్యింది. ఈ కేసులో అరెస్టైన అఖ్లాతూర్‌ అలియాస్‌ మహ్మద్‌ అఖ్లక్‌ ముజాహిద్‌ ఇతరులతో కలిసి భారతదేశంలో ఉగ్రకృత్యాలకు కుట్ర పన్నాడని ఆరోపణలు ఉన్నాయి.

ఎన్‌ఐఏ ప్రకటనలో, “అఖ్లాతూర్‌ పాకిస్తాన్‌, సిరియాలోని పలు వ్యక్తులు, సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది. ఉద్దేశ్యం భారత్‌పై జిహాద్‌ పేరుతో యుద్ధానికి మద్దతు కూడగట్టడమే” అని పేర్కొంది.

సోషల్‌ మీడియా వేదికల ద్వారా నిషేధిత ఉగ్ర సంస్థలతో నేరుగా సంప్రదింపులు జరిపిన ఆధారాలు కూడా లభించినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. విచారణ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు త్వరలో బయటపడతాయని అధికారులు తెలిపారు.

Also Read : Stock Market Growth : నేడు లాభాల్లో నడుస్తున్న స్టాక్ మార్కెట్

Exit mobile version