CBI Shocking : ఎన్ హెచ్ ఏఐ పీడీ అరెస్ట్ : సీబీఐ

ఫిర్యాదుదారుడి నుంచి లంచం

Hello Telugu - CBI Shocking

Hello Telugu - CBI Shocking

CBI : జాతీయ ర‌హ‌దారుల నిర్వ‌హ‌ణ సంస్థ (ఎన్ హెచ్ ఏఐ) ప్రాజెక్టు డైరెక్ట‌ర్ అడ్డంగా డ‌బ్బులు తీసుకుంటూ సీబీఐ చేతికి చిక్కాడు. జాతీయ ర‌హదారి ప‌క్క‌న రెస్టారెంట్ నిర్వ‌హ‌ణ‌కు ఎటువంటి ఆటంకం క‌లిగించ‌కుండా ఉండేందుకు పీడీ రూ. 1 ల‌క్ష కావాల‌ని డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి రూ. 60 వేలు తీసుకుంటుండ‌గా సీబీఐ (CBI) క‌న్నేసింది. పీడీతో పాటు ప్రైవేట్ వ్య‌క్తిపై కేసు న‌మోదు చేసింది సీబీఐ. ఈ ఘ‌ట‌న వ‌రంగ‌ల్ లో చోటు చేసుకుంది.

CBI Shocking NHAI Project Director

హైదరాబాద్ – వరంగల్ హైవేలోని బీబీనగర్‌లోని గూడూరు టోల్ ప్లాజా సమీపంలోని హైవే పక్కన ఉన్న ఫిర్యాదుదారుని రెస్టారెంట్ నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉండేందుకు డ‌బ్బులు ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. చర్చల తర్వాత‌ నిందితుడు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఐదు సంవత్సరాల పదవీకాలంలో ఫిర్యాదుదారునికి ఎటువంటి సమస్య ఉండదని హామీ ఇచ్చాడు.

రూ.60,000 అందుకోవడానికి అంగీకరించాడు. ఆగస్టు 19న ఫిర్యాదుదారుడి నుండి రూ.60,000 చొప్పున అక్రమ ప్రయోజనం డిమాండ్ చేసి అంగీకరిస్తుండగా సీబీఐ ఉచ్చు బిగించి నిందితులిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వారిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. హైదరాబాద్, వరంగల్, సదాశివపేటలోని మూడు చోట్ల సోదాలు నిర్వహించి, నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న ఉద్యోగులు పెద్ద ఎత్తున ప‌ట్టు ప‌డుతున్నారు. తాజాగా ఆమ‌న్ గ‌ల్ మండ‌ల రెవిన్యూ ఆఫీసులో ప‌ని చేస్తున్న ఎమ్మార్వో, స‌ర్వేయ‌ర్ల‌ను ప‌ట్టుకున్నారు అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు.

Also Read : Popular Comedian Brahmanandam : మంచి మ‌న‌సున్నోడు నారాయ‌ణ మూర్తి

Exit mobile version