GST : ఢిల్లీ – ఎట్టకేలకు కేంద్రం దిగి వచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ పలు అంశాలపై చర్చించింది. ప్రధానంగా గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా పెంచిన స్లాబ్ రేట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పేదలు, మధ్య తరగతి ప్రజలకు శాపంగా ధనికులకు ప్రయోజనకరంగా, లాభ దాయకంగా ఉండేలా ఈ స్లాబ్ రేట్లు ఉన్నాయని నిరసన వ్యక్తం కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కేంద్రం దిగి వచ్చింది. గతంలో ఉన్న స్లాబ్ రేట్లను సవరించింది. ప్రస్తుతం కేవలం రెండు విభాగాలుగా నిర్ణయించింది. విలాస వంతమైన వస్తువులు 40 శాతం స్లాబ్ కిందకు వస్తాయని ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయాల గురించి ఆమె వెల్లడించారు .
GST Key Updates
హెయిర్ ఆయిల్ నుండి కార్న్ ఫ్లేక్స్, టీవీలు,వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీల వరకు సాధారణ వినియోగ వస్తువులపై జీఎస్టీ (GST) పన్ను రేట్లు తగ్గించడం జరిగిందన్నారు. ప్రభుత్వం దేశీయ వ్యయాన్ని పెంచడానికి , అమెరికా సుంకాల ఆర్థిక దెబ్బను తగ్గించడానికి చూస్తున్నందున దాదాపు అన్ని వ్యక్తిగత వినియోగ వస్తువులు రేట్లను తగ్గించడం జరిగిందని చెప్పారు నిర్మలా సీతారామన్. ఏ రాష్ట్రంతోనూ విభేదాలు లేకుండా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుత నాలుగు స్లాబ్‌లు 5, 12, 18 , 28 శాతం అమలులో ఉండేవన్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కేవలం రెండు స్లాబ్ రేట్లను మాత్రమే అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అన్ని వాడే వస్తువులకు సంబంధించి ఒకటి 5 శాతం , రెండోది 18 శాతం స్లాబ్ రేట్ల పరిధిలోకి వచ్చేలా చూశామన్నారు. దీని వల్ల కోట్లాది మంది ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
Also Read : Minister Atchannaidu Important Update : నెలాఖరు లోగా నల్లబర్లీ పొగాకు కొనుగోళ్లు పూర్తి కావాలి
