Nerella Sarada : హైదరాబాద్ – తమ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సంబంధించి ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద (Nerella Sarada). ఇది చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా తన సారథ్యంలో పలువురు మహిళలతో సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తనను ప్రత్యేకంగా అభినందించారు. తమ పార్టీ ఇచ్చిన మాట కోసం అమలు చేసి తీరిందన్నారు. గత ఎన్నికల సందర్బంగా బేషరతుగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించి తీరుతామని చెప్పామని, దానిని తమ నాయకుడు చేసి చూపించారని అన్నారు.
Women Commission Chairman Nerella Sarada Comments
ఈ చారిత్రక నిర్ణయం వెనకబడుల తరగతులకి, ముఖ్యంగా బీసీ మహిళలకు సామాజిక, రాజకీయ అవకాశాల ద్వారా మహిళా సాధికారతకు కొత్త దారులు తెరుస్తుందని స్పష్టం చేశారు నేరెళ్ల శారద. ఈ రిజర్వేషన్ ద్వారా బీసీలు, ముఖ్యంగా బీసీ మహిళలు తమ కలలను సాకారం చేసుకునేందుకు, సమాజంలో సమానత్వంతో ముందుకు సాగేందుకు బలమైన ఆధారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
బీసీ మహిళల ఉన్నతి కోసం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం ఒక మహత్తర మైలు రాయిగా నిలుస్తుందని గర్వంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారత కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్బంగా సీఎంను నేరెళ్ల శారద కోరారు. ఈ సందర్బంగా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : MLC Kavitha Warning to Mallanna : తీన్మార్ మల్లన్నా జర జాగ్రత్త – కవిత
