MLC Kavitha Warning to Mallanna : తీన్మార్ మ‌ల్ల‌న్నా జ‌ర జాగ్ర‌త్త – క‌విత

వ్య‌క్తిగ‌త కామెంట్స్ చేస్తే బాగుండ‌దు

Hello Telugu - MLC Kavitha Warning to Mallanna

Hello Telugu - MLC Kavitha Warning to Mallanna

MLC Kavitha : హైద‌రాబాద్ – ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను ఉద్దేశించి సీరియ‌స్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ (MLC Kavitha). ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించాల్సింది పోయి త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె తెలంగాణ రాష్ట్ర శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిని క‌లిసి ఫిర్యాదు చేశారు. ప్ర‌తి ఒక్క‌రు ఖండించాల‌ని కోరారు. అస‌లు మ‌నం స‌భ్య స‌మాజంలోనే ఉన్నామా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

MLC Kavitha Warning to Teenmar Mallanna

తీన్మార్ మల్లన్న ఎవరు అసలు అని ప్ర‌శ్నించారు. నన్నెందుకు అడ్డుకుంటాననీ అరుస్తూ గోలా గోలా చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. త‌న‌ను ఎమ్మెల్సీ ప‌ద‌వి నుండి తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. 24 గంట‌లు గ‌డిచినా ఇప్ప‌టి దాకా త‌న‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ మహిళా నేతపై చేసిన వ్యాఖ్యలను పట్టించు కోకపోతే.. మిగతా సాధారణ మహిళల పరిస్థితి ఏంటీ అంటూ వాపోయారు. సీఎం, డీజీపీకీ రిక్వెస్ట్ చేస్తున్నాన‌ని, ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలన్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశార‌ని, మ‌రి త‌న‌పై లూజ్ కామెంట్స్ చేసిన మ‌ల్ల‌న్న‌ను ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని నిల‌దీశారు

తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, కించపరిచేలా మల్లన్న వ్యాఖ్యలపై ‘కమిటీ ఆన్ ఎథిక్స్’కు రెఫర్ చేయాలని లేఖ అంద‌జేశారు మండ‌లి చైర్మ‌న్ కు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. గౌరవ చట్టసభలో సభ్యుడిగా ఉన్న మల్లన్న తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : Srisailam Sparsa Darshan Shocking : భక్తులకు షాక్..ఇక శ్రీశైలం స్పర్శదర్శనం నిలిచినట్టే

Exit mobile version