NCDRC : ఢిల్లీ – కేంద్ర వినియోగదారుల, వ్యవహారాల శాఖ (NCDRC) మరోసారి పౌరులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. వినియోగదారులు ఆలస్యం చేయకుండా ఫిర్యాదులు చేయాలని కోరారు. ఈ మేరకు వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు, చైతన్యవంతం చేసేందుకు గాను జాగో గ్రహక్ జాగో పేరుతో ప్రచారం చేస్తోంది. వాపసు నిరాకరించ బడటం, లోప భూయిష్ట లేదా డెలివరీ చేయని ఉత్పత్తులు లేదా పేలవమైన సేవలు వంటి సమస్యలను వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్బంగా ఎలాంటి బెరుకు, భయం లేకుండా వినియోగదారులు వేచి ఉండ కూడదని లేదా రాజీ పడవద్దని సూచించింది శాఖ.
NCDRC Comments
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేలా చూసేందుకు, ప్రభుత్వం దేశ వ్యాప్తంగా బహుళ భాషలలో అందుబాటులో ఉన్న జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (NCH)ను ఏర్పాటు చేసింది. వినియోగ దారులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి భారతదేశంలో ఎక్కడి నుండైనా 1915కు కాల్ చేయవచ్చని తెలిపింది. అంతే కాకుండా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని ప్రకటించింది. 8800001915 నంబర్‌లో వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదులను దాఖలు చేయవచ్చని స్పష్టం చేసింది., దీని ద్వారా ప్రక్రియ సులభతరం, మరింత అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
ఈ హెల్ప్‌లైన్ వినియోగదారులను నేరుగా కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ అధికారులతో అనుసంధానించి వివాదాలను సమర్థవంతంగా పరిష్కరిస్తుందని స్పష్టం చేసింది. ఫిర్యాదులు పరిష్కారం కాకపోతే వినియోగదారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లను సంప్రదించే అవకాశం కూడా ఉందని తెలిపింది.
అధికారులు పౌరులను ఈ సేవలను ఉపయోగించు కోవాలని, వారి వినియోగదారుల హక్కుల కోసం నిలబడాలని కోరారు, సమస్యలను సకాలంలో నివేదించడం వల్ల మెరుగైన రక్షణ, జవాబుదారీతనం లభిస్తుందని నొక్కి చెప్పారు.
Also Read : Mallikarjun Kharge Shocking Comments : మోదీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి
