Mallikarjun Kharge : న్యూఢిల్లీ – ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి మోదీ అంటూ పేర్కొన్నారు. ప్రధానిని అధికారం నుంచి దించక పోతే మీ ఓట్లు, హక్కులు, స్వేచ్ఛ, రాజ్యాంగం కూడా సురక్షితంగా ఉండవన్నారు. తనను పవర్ నుంచి దూరం చేస్తేనే దేశం బాగు పడుతుందన్నారు. సోమవారం ఖర్గే మీడియాతో మాట్లాడారు. 2014లో దేశంలో కొలువు తీరిన బీజేపీ కేంద్ర సర్కార్ వల్ల దేశానికి ఒనగూరింది ఏమీ లేదన్నారు. అన్ని వ్యవస్థలు పూర్తిగా సర్వ నాశనం అయ్యాయని ఆరోపించారు. ప్రజలు ఇకనైనా మేలుకోక పోతే తీవ్ర ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. ఇప్పటి వరకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సవాలక్ష ప్రజా వ్యతిరేక విధానాలకు తెర తీశారంటూ మండిపడ్డారు.
Mallikarjun Kharge Shocking Comments on PM Modi
కేంద్ర సంస్థలనై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఐటీ, ఆర్మీ అన్ని రంగాలను అయ్యా ఎస్ అనేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. కేవలం ప్రచారం చేసుకోవడం తప్పా 143 కోట్ల మంది భారతీయులకు ఏం చేశారో చెప్పాలని మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. జన్ ధన్ ఖాతాలలో డబ్బులు జమ చేస్తానంటూ ప్రకటించిన ప్రధానమంత్రి ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభం లాంటి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా నిర్వీర్యం చేశారని, దానిని తమ నియంత్రణలోకి తీసుకుని సర్వ నాశనం చేశారంటూ ఆరోపించారు. బీహార్ లో ఎలా ఒకే సారి 65 లక్షల మంది ఓటర్ల జాబితాను తొలగిస్తారని ప్రశ్నించారు మల్లికార్జున్ ఖర్గే.
Also Read : Minister Savitha Shocking Comments : వైసీపీకి డిపాజిట్లు రావని జగన్ కు తెలుసు
