TPCC Chief Mahesh Goud Shocking Update : న‌వీన్ యాద‌వ్ గెలుపొంద‌డం ఖాయం

ప్ర‌క‌టించిన టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్

Hello Telugu - TPCC Chief Mahesh Goud Shocking Update

Hello Telugu - TPCC Chief Mahesh Goud Shocking Update

Mahesh Goud : హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌కు సంబంధించి పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింద‌ని అన్నారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ (Mahesh Goud). ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. స‌ర్వే సంస్థ‌ల‌న్నీ గంప గుత్త‌గా త‌మ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్ భారీ మెజారిటీతో గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని చెప్పాయ‌ని తెలిపారు. పార్టీ అభ్య‌ర్థి త‌ర‌పున పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసిన పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర‌జా ప్ర‌తినిధులు, నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణుల‌కు ఈ సంద‌ర్బంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు మ‌హేష్ కుమార్ గౌడ్. ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్ట బోతున్నారని స్థానిక నాయకుల ద్వారా తన‌కు తెలిసింద‌ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి న‌వీన్ యాద‌వ్ భారీ మెజారిటీతో గెలుస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు.

TPCC Chief Mahesh Goud Key Comments

ఉప ఎన్నికను ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నార‌ని చెప్పారు. ఆయ‌న ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించార‌ని, మంత్రులు, ఎమ్మెల్యేల‌కు దిశా నిర్దేశం చేశార‌ని అన్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు చేర‌వేయ‌డంలో తాము స‌క్సెస్ అయ్యామ‌ని అన్నారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. ఇదిలా ఉండగా గ‌త 10 ఏళ్ల‌లో బీఆర్ఎస్ పాల‌న‌లో చోటు చేసుకున్న విధ్వంసాన్ని తాము చెప్ప‌డం వ‌ల్ల‌నే ఈ గెలుపు సాధ్యం కాబోతోంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Also Read : CBI Court Shocking YS Jagan : వైఎస్ జ‌గ‌న్ అభ్య‌ర్థ‌న సీబీఐ కోర్టు తిర‌స్క‌ర‌ణ

Exit mobile version