YS Jagan : అమరావతి : అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan) కోలుకోలేని షాక్ తగిలింది. ఈ కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు షాక్ ఇచ్చింది. తన అభ్యర్థనను తోసి పుచ్చింది. ఈనెల 21న విధిగా విచారణకు హాజరు కావాల్సిందేనంటూ స్పష్టం చేసింది. ఎలాంటి మినహాయింపులు అంటూ ఉండవని పేర్కొంది. రావాల్సిందేనంటూ ఆదేశించింది. దీంతో సీబీఐ కోర్టు సీరియస్ కామెంట్స్ చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తాను కోర్టు ముందు విచారణకు హాజరవుతానని తెలిపారు జగన్ రెడ్డి.
CBI Court Shocking YS Jagan
తను విదేశాలకు వెళ్లాల్సి ఉందని, వ్యక్తిగత పనుల నిమిత్తం అందుకే తనకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ సీఎం. అయితే యూరప్ వెళ్లాలని అనుకుంటే ఈనెల 14వ తేదీ లోపు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది సీబీఐ కోర్టు. అయితే తనకు విచారణకు హాజరు కాకుండా ఉండేదుకు గాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయ్యేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు జగన్ రెడ్డి. దీనిపై సీబీఐ వ్యతిరేకిస్తూ కౌంటర్ దాఖలు చేసింది. పదే పదే గైర్హాజరు పిటిషన్లు వేస్తే ప్రతి శుక్రవారం కోర్టు హాజరు తప్పనిసరి చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ న్యాయ నిపుణులు జగన్‌కు మినహాయింపు అభ్యర్థనను విరమించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
Also Read : Jubilee Hills By Election Sensational : జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ లో హస్తానిదే హవా
